- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లల గ్రాడ్యుయేషన్ వేడుకలో భయానకం.. తల్లిదండ్రుల మధ్య అసలేం జరిగింది?
సాధారణంగా గ్రాడ్యుయేషన్ డే అంటే.. విద్యార్థులకు జీవితంలో ఓ మైలురాయిగా నిలిచే అనుభవం, ఆనందంతో ముంచెత్తే వేడుక, అభినందనలు, అభిమానం, ఫొటోలు, నవ్వులు!

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా గ్రాడ్యుయేషన్ డే (Graduation Day) అంటే.. విద్యార్థులకు జీవితంలో ఓ మైలురాయిగా నిలిచే అనుభవం, ఆనందంతో ముంచెత్తే వేడుక, అభినందనలు, అభిమానం, ఫొటోలు, నవ్వులు! కానీ అమెరికాలోని (USA) ఓ స్కూల్లో ఈ పండుగ.. కొందరి వల్ల కన్నీటి కళ్లతో ముగిసింది. ఆర్కాన్సాస్ రాష్ట్రంలోని వెస్ట్ మెంఫిస్ నగరంలో ఉన్న ఫాల్కీ ఎలిమెంటరీ స్కూల్‌లో.. మే 28న గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించారు. చిన్నారులు సహా వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.
అయితే, ఈ వేడుకల్లో ఏం జరిగిందో తెలియదు కానీ, ఒక్కసారిగా కొందరు మహిళల మధ్య వాగ్వాదం మొదలైంది. అదికాస్త చివరకు ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకొనే దాకా వెళ్లింది. వారిని ఆపేందుకు ముందుకు వచ్చిన ఇద్దరు పురుషులు కూడా ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ దృశ్యాలను చూసిన చిన్నారులు భయంతో తల్లడిల్లి, కన్నీళ్లతో గొడవ ఆపాలంటూ వేడుకోవడం హృదయ విదారకంగా మారింది. చదువుకోమని పిల్లల్ని పాఠశాల పంపిన తల్లిదండ్రులే వారికే భయానక అనుభవాన్ని అందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక ఈ ఉదంతంపై పాఠశాల యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. "పాఠశాల పరిసరాల్లో ఇలాంటి ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. విద్యార్థుల భద్రతే మా మొదటి కర్తవ్యం. ఈ ఘటనపై జరుగుతున్న పోలీసుల దర్యాప్తుకు మేము సంపూర్ణ సహకారం అందిస్తున్నాం" అంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.






