విద్యార్థుల శాంతియుత నిరసనపై లాఠీఛార్జ్ అమానుషం

by Ratna Kumari |

శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అత్యంత అమానుషమని తాడ్వాయి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.

విద్యార్థుల శాంతియుత నిరసనపై లాఠీఛార్జ్ అమానుషం
X

దిశ, తాడ్వాయి : కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అత్యంత అమానుషమని తాడ్వాయి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని పేర్కొన్నారు. అలాంటి విద్యార్థుల ఉద్యమాన్ని పోలీసు బలగాలతో అణచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.

విద్యార్థుల న్యాయమైన పోరాటానికి మద్దతు తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అడ్డుకోవడం కేంద్ర ప్రభుత్వ భయానికి నిదర్శనమని అన్నారు. శాంతియుత ఆందోళనలను బలప్రయోగంతో అణచివేయాలని చూస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎలాంటి అణచివేత చర్యలు చేపట్టినా విద్యార్థుల గొంతును మూయలేరని పేర్కొన్న ప్రశాంత్ గౌడ్, కేంద్ర ప్రభుత్వం అహంకార వైఖరిని వీడి నైతిక బాధ్యత వహించి సంబంధిత మంత్రి చేత వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. లాఠీఛార్జ్‌లో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

Next Story