మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు: టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై లోక్‌సభ సస్పెన్షన్ వేటు

by Malleboina Mahesh |   (  Updated:2026-07-22 09:08:21  IST  )

మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు TMC ఎంపీ కల్యాణ్ బెనర్జీని వర్షాకాల సమావేశాల ముగింపు వరకు లోక్‌సభ సస్పెండ్ చేసింది.

మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు: టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై లోక్‌సభ  సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్ లో దుమారం రేపుతున్న క్రమంలో మహిళా ఎంపీపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభలో టీఎంసీ రేబల్ ఎంపీలతో గొడవకు దిగారు. అలాగే ఒక మహిళా ఎంపీ పట్ల తీవ్రమైన పార్లమెంటరీయేతర పదజాలాన్ని (Unparliamentary Language) ఉపయోగించారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై లోక్‌సభ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి లోక్‌సభ ఆమోదం తెలిపింది. వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు ఆయనను సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. సభా వ్యవహారాల నియమావళి ప్రకారం ప్రజాప్రతినిధులు గౌరవప్రదంగా ప్రవర్తించాలని, మహిళా సభ్యురాలిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సభా దిగ్బంధనానికి, క్రమశిక్షణా రాహిత్యానికి సంకేతమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story