గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత..

by Kodari Anjali |

నాంపల్లిలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత..
X

దిశ, కార్వాన్: నాంపల్లిలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా గాంధీ భవన్ ముట్టడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బుధవారం ఒక్కసారిగా తరలివచ్చిన బీజేపీ నాయకులు గాంధీ భవన్ వెలుపల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బ్యానర్లను చించివేసి గాంధీ భవన్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పై బైఠాయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీసులు ప్రత్యేక వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Next Story