గణపతి పూజ కోసం పంతులును కిడ్నాప్

by Muthe.Rajitha |   (  Updated:2025-08-28 17:27:58  IST  )

గణపతి పూజ కోసం పువ్వులో, పత్రి ఆకులో దొంగతనం చేయడం చూసాం గాని, ఏకంగా పూజ చేసే పంతులును కిడ్నాప్ చేసిన వింత ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.

గణపతి పూజ కోసం పంతులును కిడ్నాప్
X

దిశ, వెబ్ డెస్క్ : గణపతి పూజ కోసం పువ్వులో, పత్రి ఆకులో దొంగతనం చేయడం చూసాం గాని, ఏకంగా పూజ చేసే పంతులును కిడ్నాప్ చేసిన వింత ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. సిద్ధిపేట జిల్లా కోహెడలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. కోహెడలో ఓ వీధిలోని రెండు గణేష్ మండపాల్లో పూజ చేసేందుకు ఒకే పంతులును మాట్లాడుకోగా.. నేడు సాయంత్రం పూజ తమ మండపంలోని మొదట జరగాలంటే తమవద్దే మొదట జరగాలని ఇరు గ్రూపులు గొడవపడ్డారు. ఇంతలో ఓ గ్రూప్ అక్కడే ఉన్న పంతులును ఎత్తుకొని, బైక్ మీద తీసుకొని వెళ్లారు. ఈ ఘటన చూసిన స్థానికులు విరగబడి నవ్వుకోగా.. దీనిని అంతటినీ వీడియో తీసి నెట్లో పోస్ట్ చేయగా.. పంతులు కిడ్నాప్ వీడియో వైరల్ గా మారింది.

Next Story