పాకిస్థానీ పిజ్జా.. తింటే ప్రాణం పోవాల్సిందే

by Ajay Maddhiboyina |

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తరవాత ఫుల్ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నవి కూడా ఈ వీడియోలే. సాధారణంగా ఫుడ్ అంటే ఇష్టం ఉండనివారు ఉండరు.

పాకిస్థానీ పిజ్జా.. తింటే ప్రాణం పోవాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తరవాత ఫుల్ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నవి కూడా ఈ వీడియోలే. సాధారణంగా ఫుడ్ అంటే ఇష్టం ఉండనివారు ఉండరు. కాబట్టి చాలా మంది క్రియేటర్లు ఫుడ్ వ్లాగ్స్ తీయడంతోనే పాపులర్ అవుతున్నారు. ఇక మన వంటకాలు ఎలాగూ చూస్తూనే ఉంటాం కాబట్టి ఇతర దేశాల వంటకాల వీడియోలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కు చెందిన ఫుడ్ వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ వీడియోల్లో ఫుడ్ తయారు చేస్తున్నప్పుడు శుభ్రత పాటించకపోవడం, నూనెను ఎక్కువ ప్రాసెసింగ్ చేసి వాడటంతో విమర్శలు వస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి పిజ్జా లాంటి దానిని తయారు చేయగా దానిని నూనెలో వేసి తరవాత బయటకు తీశాడు. నిజానికి పిజ్జాను మైక్రో ఓవెన్ లో తయారు చేస్తుంటారు. కానీ ఆ వ్యక్తి మరుగుతున్న నల్లని నూనెలో తీయడంతో అది ఇంజిన్ ఆయిల్ అని తింటే పైకి పోతారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. video

Next Story