- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అక్కా చెల్లెల్లు వారి సోదరులకు రాఖీ కట్టేందుకు సిద్ధమౌతారు. సొంత అక్కా చెల్లెల్లే కాకుండా ఎవరిని సోదరిగా భావించినా రాఖీ కట్టి వారి మంచి కోరుకుంటారు. అలా దేశ ప్రధాని మోడీకి పాకిస్థాన్ సంతతికి చెందిన మహిళ 30ఏళ్ల నుండి రాఖీ కడుతోంది. ఖమర్ మొహ్సిన్ షేక్ అనే మహిళ పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించింది. ఆమె అహ్మదాబాద్‌కు చెందిన భారతీయుడిని వివాహం చేసుకోవడంతో ఇక్కడే భర్త బిడ్డలతో కలిసి జీవిస్తోంది. కాగా ఖమర్‌కు చేతితో ప్రత్యేకమైన రాఖీలు చేసే నైపుణ్యం ఉంది. ప్రతి ఏడాది ఆమె కొన్ని రాఖీలు తయారు చేస్తూ అందులో మోడీ కోసం ప్రత్యేకంగా రాఖీని తయారు చేస్తుంది.
ఈ ఏడాది ఓం గుర్తుతో ఉండే రాఖీని ఖమర్ మెడీ చేతికి కట్టారు. పాకిస్థానీ సోదరితో మొదటిసారి మెడీకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో కార్యకర్తగా ఉన్నప్పుడు పరిచయం ఏర్పడింది. అలా మొదటిసారి పరిచయం ఏర్పడినప్పుడు మోడీ ఖమర్‌ను ఎలా ఉన్నారని అడిగారట. ఆ తరవాత వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి సోదర సోదరి బంధానికి నాందిపలికినట్టు తెలుస్తోంది. ఆ రోజు నుండి ఖమర్ రాఖీ పండుగ వచ్చిందంటే చాలు మోడీకి రాఖీ కట్టి ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటారట. గత ఎన్నికలకు ముందు కూడా ఆయనకు రాఖీ కట్టి మళ్లీ ప్రధాని అవ్వాలని కోరుకున్నట్టు తెలిపింది. ఇక ఈ ఏడాది రాఖీ కట్టిన తరవాత కూడా తనకు మోడీతో ఉన్న సోదర బంధాన్ని ఎంతో ఆదరిస్తానని చెప్పుకొచ్చింది.






