- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Blink It : పాక్ ఓటమి.. బ్లింకిట్ సెటైర్లు
ఆదివారం జరిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్(India-Pakisthan Match) లో పాక్ దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఆదివారం జరిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్(India-Pakisthan Match) లో పాక్ దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ఆతిధ్య జట్టుగా బరిలోకి దిగిన పాకిస్థాన్.. తన చిరకాల ప్రత్యర్థి అయిన భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. అయితే భారత్ చేతిలో పాక్ ఓడిన ప్రతిసారి.. పాక్ అభిమానులు టీవీలు పగలగొట్టడం సాధారణం. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టంట్ డెలివరీ యాప్ బ్లింకిట్(Blink It) సెటైర్లు వేసింది. "సారీ పాక్.. మీకు 10 నిముషాల్లో టీవీని డెలివరీ చేయలేం" అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరోవైపు ఢిల్లీ పోలీస్(Delhi Police) శాఖ కూడా ఇలాంటి పోస్ట్ చేసింది. భారత్ చేతిలో పాక్ ఓడిపోయి, అభిమానులు టీవీలు పగలగొట్టడాన్ని ఉద్దేశిస్తూ.. పక్క దేశం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తు అవి కేవలం టీవీలు బద్దలు కొట్టిన శబ్దాలు అని మాత్రమే అనుకుంటున్నాము అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెట్టింట్లో బాగా పేలింది. పాక్ లో టీవీలకు ఇనుప కంచెలు వేసిన మీమ్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.






