పద్మశ్రీ అవార్డు గ్రహీత, రూ.80 కోట్ల ఆస్తి.. కడచూపుకు రాని పిల్లలు

by Muthe.Rajitha |

ఉత్తరప్రదేశ్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత,రూ. 80 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి వృద్ధాశ్రమంలో మరణించగా.. అతని పిల్లలు కనీసం కడచూపు చూడటానికి రాలేదు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత, రూ.80 కోట్ల ఆస్తి.. కడచూపుకు రాని పిల్లలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత,రూ. 80 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి వృద్ధాశ్రమంలో మరణించగా.. అతని పిల్లలు కనీసం కడచూపు చూడటానికి రాలేదు. ఎంతసేపటికీ పిల్లల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో స్థానికులు చందాలు వేసుకొని అంత్యక్రియలు చేసిన హృదయవిదారక ఘటన కాశీలో జరిగింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆధ్యాత్మిక సాహిత్యవేత్త అయిన శ్రీనాథ్ ఖండేల్‌వాల్ కు రూ. 80 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ.. కొడుకు, కూతురు అతన్ని వృద్ధాశ్రమంలో వదిలేశారు.

గత ఐదేళ్లుగా అక్కడే ఉంటుండగా.. 80వ ఏట వృద్ధాశ్రమంలోనే మరణించారు. చివరి చూపు చూడటానికి కానీ, అంత్యక్రియలకు కానీ ఆయన కుటుంబ సభ్యులు గాని, పిల్లలు గాని ఎవరూ రాలేదు. శ్రీనాథ్ ఖండేల్‌వాల్ వందకు పైగా పుస్తకాలు రాయగా.. అందుకుగాను 2023లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉండగా.. కొడుకు వ్యాపారవేత్త, కూతురు సుప్రీంకోర్టులో లాయర్ గా విధులు నిర్వహిస్తోంది.

ఇంతమంది ఆప్తులు ఉన్నా, ఎంత ఆస్థి ఉన్నా, కన్న తండ్రి పట్ల ఏ ఒక్కరు తమ బాధ్యత నిర్వర్తించలేదు. చివరికి స్థానికులే తలా కొంచెం చందాలు వేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం అనేది మనుషుల్లో, ఆఖరికి కడుపున పుట్టిన సొంత పిల్లల్లో కూడా కనుమరుగైపోతుందనడానికి ఈ ఘటన ఉదాహరణ.

Next Story