- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవుట్ ఫిట్ ఫ్రం స్క్రాచ్ కాదు బ్రో.. ఇప్పుడు అవుట్ ఫిట్ ఫ్రం బెడ్ షిట్‌యే ట్రెండ్!
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అవుట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ (Outfit from scratch) అనే వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాబ్రిక్ స్టోర్‌కి వెళ్లి నచ్చిన క్లాత్ సెలెక్ట్ చేసుకుని తమకు ఇష్టమైన డిజైన్‌లలో దుస్తులను తయారు చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో 'అవుట్‌ఫిట్ ఫ్రం స్క్రాచ్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో లెక్కలేనన్ని వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇవన్నీ వ్యక్తిగత అభిరుచిని, డిజైన్ సెన్స్‌ను చూపించడమే కాకుండా, ఫ్యాషన్‌ను మరింత దగ్గరగా అనిపించేలా చేస్తున్నాయి. అయితే, తాజాగా ఈ ట్రెండ్‌కి మరో కొత్త మలుపు ఇచ్చింది ఢిల్లీకి (Delhi) చెందిన కంటెంట్ క్రియేటర్ సిమ్రన్ ఆనంద్ (Content creator Simran Anand). 'అవుట్ ఫిట్ ఫ్రం బెడ్ షిట్ (Outfit from bed shit)' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ (Viral) అవుతోంది.
సిమ్రాన్ 20 కిలోల బరువుతో చక్కటి ఎంబ్రాయిడిరీ వర్క్ చేసి అందంగా ఉన్న బెడ్ షీట్‌ను ఇందుకోసం ఎంచుకుంది. అనంతరం దానిని ప్రొఫెషనల్ డిజైనింగ్ కట్‌లతో, ఫిట్టింగ్‌తో, ఫ్యాషన్ సెన్స్‌తో సూపర్ లెహంగాగా మార్చేసింది. దీంతో ఇంట్లో పాతబడి మరిచిపోయిన బెడ్‌షీట్లను కూడా క్రియేటీవ్‌గా ఉపయోగించొచ్చనే అనే ట్రెండ్‌కు తెరతీసింది. ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోలో సిమ్రన్ తన డిజైన్‌ను చూపిస్తూ.. 'బెడ్‌షీట్‌లలో నాకు ఫ్యాషన్ కనిపించింది. వాటిని ఇలా ఉపయోగించడం వల్ల అవి రెండో జీవితం పొందుతాయి' అని వివరించింది.
ఇక ఈ యూనిక్ ఐడియా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 'దుప్పట్లతో లెహంగాలు చేయవచ్చా?', 'ఇది నిజంగా గేమ్‌చేంజర్!', 'ఇది కేవలం ఫ్యాషన్ కాదు, ఆలోచనలో కొత్తదనం' అంటూ రకరకాల కామెంట్ల వర్షం కురిపిస్తోన్నారు. అంతేకాదు, ఇకపై 'అవుట్‌ఫిట్ ఫ్రం స్క్రాచ్' కాదు సుమీ.. 'అవుట్‌ఫిట్ ఫ్రం బెడ్‌షీట్!' ఈ మాటే కొత్త ఫ్యాషన్ మంత్రంగా మారబోతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






