15 మంది భర్తలతో భార్య.. అందరూ ఇంగ్లాండ్ చేరుకోగానే.. అసలు ట్విస్ట్..

by Sujitha Rachapalli |

పంజాబ్‌లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ 15 మంది భర్తలను కలిగి ఉన్నట్లు.. వారిని అందరినీ ఇంగ్లాండ్ పంపినట్లు.. ఓ కేసు సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఆమెను ఇంగ్లాండ్‌లో అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు పోలీసులు, కుటుంబీకులు.

15 మంది భర్తలతో భార్య.. అందరూ ఇంగ్లాండ్ చేరుకోగానే.. అసలు ట్విస్ట్..
X

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్‌లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ 15 మంది భర్తలను కలిగి ఉన్నట్లు.. వారిని అందరినీ ఇంగ్లాండ్ పంపినట్లు.. ఓ కేసు సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఆమెను ఇంగ్లాండ్‌లో అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు పోలీసులు, కుటుంబీకులు. అలంపూర్‌కు చెందిన భీందర్ సింగ్‌.. కొడుకుతో కలిసి ఇంగ్లాండ్‌‌లో ఉంటున్న భార్య దగ్గరకు వెళ్లేందుకు వీసా అప్లయ్ చేశాడు. కానీ అతని వీసా రిజెక్ట్ అయింది. పైగా తన భార్యకు 15 మంది భర్తలు ఉన్నారనే న్యూస్ తెలిసి దిమ్మతిరిగింది. అయితే ఆ తర్వాత ఇందులో మోసం జరిగిందని.. ఇమ్మిగ్రేషన్ సంస్థ నడుపుతున్న ఇద్దరు దంపతులు తన భార్య సర్టిఫికేట్స్‌ను వాడుకున్నారని, 15 మంది యువకులను ఆమె భర్తగా ఇంగ్లాండ్ పంపించారని తెలుసుకున్నాడు. పోలీసులను ఆశ్రయించాడు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులు ఆమె పేరుతో దాదాపు రూ.5.90 వేలు కాజేసినట్లు తేలింది. ప్రస్తుతం నిందితులైన ప్రశాంత్, రూబీని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

Next Story