- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాడు కోటీశ్వరుడు.. నేడు హోటల్ ఉద్యోగి: రూ.2 కోట్లు నష్టపోయినా చెరగని చిరునవ్వు
కోవిడ్ మహమ్మారి వల్ల వ్యాపారంలో రూ.2 కోట్లు పోగోట్టుకున్నా.. కుంగిపోకుండా మళ్లీ జీవితాన్ని జీరో నుంచి మొదలుపెట్టిన వ్యక్తి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ఎంతోమంది జీవితాలను తలకిందులు చేసింది. కొందరు కుటుంబ సభ్యులను కోల్పోతే, మరికొందరు ఆస్తులన్నింటినీ పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో, కష్టాల్లోనూ ధైర్యంగా ఎలా ఉండాలో చూపిస్తోంది. దుబాయ్ (Dubai) మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి, తాను కోవిడ్ సమయంలో రూ. 2 కోట్లు నష్టపోయినట్లు చాలా ప్రశాంతంగా వివరిస్తున్న తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
జీరో నుంచి మళ్లీ జీవితం స్టార్ట్..
కోవిడ్ రాకముందు సదరు వ్యక్తి భారతదేశంలో భవన నిర్మాణ సామాగ్రి (Building Materials) వ్యాపారాన్ని విజయవంతంగా నడిపేవారు. అయితే కోవిడ్ మహమ్మారి సమయంలో సప్లయర్లకు అడ్వాన్స్ రూపంలో ఇచ్చిన సుమారు రూ. 2 కోట్లు వెనక్కి రాలేదు. దీంతో ఆయన వ్యాపారం కుప్పకూలింది. దాచుకున్న డబ్బంతా పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ఇంతటి భారీ నష్టం వాటిల్లినా ఆయన కుంగిపోలేదని తెలిపారు. ప్రస్తుతం దుబాయ్‌లోని ‘ఇంటర్నెట్ సిటీ’లో ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేస్తూ తన జీవితాన్ని మళ్లీ సున్నా నుంచి ప్రారంభించారు. మెట్రోలో ప్రయాణిస్తూ.. బ్యాగు తగిలించుకుని ఎంతో సీదాసాదాగా తన గతాన్ని వివరించిన ఆయన, ‘జీవితం సాగిపోవాల్సిందే’ అని చిరునవ్వుతో చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఆ వ్యక్తిలో ఎలాంటి అసహనం గానీ, పశ్చాత్తాపం గానీ కనిపించకపోవడం అందరిని కట్టిపడేస్తోంది.
చైనాలో కరెన్సీ వాన: భర్తపై కోపంతో బాల్కనీలోంచి రూ.1.5 కోట్లు విసిరేసిన భార్య వైరల్






