ఓ వైపు దుర్గా నవరాత్రులు.. మరోవైపు మహిళల అశ్లీల నృత్యాలు

by Kema Shiva Kumar |

అశ్లీల నృత్యాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా ఇటీవలి కాలంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నిలిచింది.

ఓ వైపు దుర్గా నవరాత్రులు.. మరోవైపు మహిళల అశ్లీల నృత్యాలు
X

దిశ, వెబ్‌డెస్క్: అశ్లీల నృత్యాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా ఇటీవలి కాలంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నిలిచింది. సంక్రాంతి సంబురాలు, తిరనాళ్లు, గంగమ్మ జాతర ఇలా కార్యక్రమం ఏదైనా అశ్లీల రికార్డింగ్ డాన్సులు ఉండాల్సిందే. లేకపోతే సీన్ సితార్ అయిపోద్ది అన్న చందంగా పరిస్థితి ఉంటుంది. ఆ విషయం అటుంచితే.. సాధారణంగా దుర్గా శరన్నవ రాత్రులు అంటే మనకు తెలిసినంత వరకు పద్ధతిగా పూజలు, పునస్కారాలు, దీక్షలు ఉంటాయి. కానీ, ఉత్తర‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodha)లో రోటీన్‌కు భిన్నంగా దుర్గ శరన్నవరాత్రులు జరగుతున్నాయండోయ్. వివరాల్లోకి వెళితే.. ఖండ్సా బజార్‌ (Khandsa Bazar)లో దుర్గా పూజను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.

అయితే, అమ్మ వారికి పూజలు చేస్తే ఏముంది వెరైటీ అనుకున్నారో ఏమో.. పండల్ ప్రాంగణంలో నిర్వాహకులు ఏకంగా రికార్డింగ్ డాన్స్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఐదుగురు యువతులు పొట్టి బట్టలతో ఒళ్లు కనబడి.. కనబడకుండా దుస్తులు ధరించి డ్యాన్స్ చేస్తుంటే.. కాటికి కాళ్లు చాపిన ముసలోడి నుంచి మీసాలు కూడా రాని కుర్రాళ్లు ఎగబడి మరి చూశారు. అయితే, అశ్లీల డాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు చూసిన నెటిజన్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పండల్ నిర్వాహకులను కామెంట్లతో ఏకి పారేస్తున్నారు. అమ్మవారి ఎదుట అశ్లీల నృత్యాలు ఏంటని ఫైర్ అవుతున్నారు. మరికొందరు పోయేకాలం దాపురించిందని ధ్వజమెత్తారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈవెంట్ జరగుతున్న ప్రాంతానికి కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అయినప్పటికీ అశ్లీల నృత్యాలపై పోలీసులు జోక్యం చేసుకోకపోవడం కూడా పలు అనుమాలకు తావిచ్చింది.

Next Story