లాటరీలో రూ. 12 కోట్లు గెలిచిన వృద్ధుడు.. న్యూడ్ లైవ్ వీడియోలకే తగలెట్టాడు.. ఒక్కొక్కరికి కోటిన్నర..

by Sujitha Rachapalli |

లాటరీ తగిలిందంటే లైఫ్ మారిపోతుంది. కటిక పేదరికంలో బతుకుతున్న వారు.. దేవుడా ఇన్నాళ్లకు కనికరించావా అని సంతోషపడిపోతారు. మంచి ఆహారం, సొంత ఇళ్లు, భార్యాపిల్లల పేరు మీద డబ్బు దాచడం వంటి ప్లాన్స్ చేసుకుంటారు. కానీ ఈ వృద్ధుడి విషయంలో అలా

లాటరీలో రూ. 12 కోట్లు గెలిచిన వృద్ధుడు.. న్యూడ్ లైవ్ వీడియోలకే తగలెట్టాడు.. ఒక్కొక్కరికి కోటిన్నర..
X

దిశ, వెబ్ డెస్క్ : లాటరీ తగిలిందంటే లైఫ్ మారిపోతుంది. కటిక పేదరికంలో బతుకుతున్న వారు.. దేవుడా ఇన్నాళ్లకు కనికరించావా అని సంతోషపడిపోతారు. మంచి ఆహారం, సొంత ఇళ్లు, భార్యాపిల్లల పేరు మీద డబ్బు దాచడం వంటి ప్లాన్స్ చేసుకుంటారు. కానీ ఈ వృద్ధుడి విషయంలో అలా జరగలేదు. కారణం అతని ప్రవర్తనే. చైనాకు చెందిన ఓ వృద్ధుడికి సొసైటీలో మంచి పేరు ఉంది. కానీ సంపాదన మాత్రం అంతంతే. అయితే అనుకోకుండా అతనికి లాటరీ తగిలింది. ఏకంగా రూ. 12.3 కోట్లు గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని భార్యతో పంచుకున్నాడు. డబ్బులు ఉన్న ఎకౌంట్‌కు సంబంధించిన ఏటీఎం కార్డు కూడా ఆమెకు ఇచ్చాడు. దీంతో ఆమె సంతోషపడిపోయింది. ఇక మా తలరాత మారుతుందని సంబురపడింది.

కట్ చేస్తే భర్త బిహేవియర్‌లో తేడాను గమనించింది. పగలు జూదం, రాత్రి న్యూడ్ వీడియోల లైవ్ స్ట్రీమింగ్‌కు డబ్బులు తగలబెట్టడం చేస్తున్నాడని తెలుసుకుంది. ఓ మహిళ వీడియోల కోసం కోటిన్నర పంపించినట్లు తెలుస్తుండగా.. ఆమెతో నాలుగు రోజులు ట్రిప్‌కు కూడా వెళ్లాడు. చివరకు రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డాడు. ఇలా చాలా మంది అమ్మాయిలకు లక్షల్లో ట్రాన్స్‌ఫర్ చేశాడు. చివరకు ఏటీఎం తీసి చెక్ చేస్తే అందులో డబ్బులు నిల్. దీంతో ఆగ్రహించిన భార్య.. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. ఆకస్మిక సంపద తన భర్తను ఇలా మార్చేసిందని.. ఒకవేళ లాటరీ గెలువకపోతే తన కుటుంబం ఇప్పటికీ కలిసి సంతోషంగా ఉండేదని అభిప్రాయపడింది.

Next Story