అన్నం పెట్టకుండా తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసిన కొడుకులు, కోడళ్లు.. పోలీస్ స్టేషన్‌లో కడుపు నిండా భోజనం పెట్టిన పోలీస్ ఆఫీసర్

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్‌లోని ఏటా జిల్లా జలేసర్ పోలీస్ స్టేషన్‌లో హృదయాన్ని హత్తుకునే సంఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకులు, కోడళ్లు ఇంటి నుంచి బయటకు గెంటేయగా.. రోజుల తరబడి ఆకలితో ఉన్న

అన్నం పెట్టకుండా  తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసిన కొడుకులు, కోడళ్లు.. పోలీస్ స్టేషన్‌లో కడుపు నిండా భోజనం పెట్టిన పోలీస్ ఆఫీసర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని ఏటా జిల్లా జలేసర్ పోలీస్ స్టేషన్‌లో హృదయాన్ని హత్తుకునే సంఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకులు, కోడళ్లు ఇంటి నుంచి బయటకు గెంటేయగా.. రోజుల తరబడి ఆకలితో ఉన్న వృద్ధ దంపతులు తమ బాధను చెప్పుకునేందుకు పీఎస్‌కు వెళ్లారు. తిని చాలా రోజులు అయిందని.. తమకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అమిత్ కుమార్.. వృద్ధ దంపతులను కూర్చోబెట్టి భోజనం అందించారు. వారితో కలిసి అతను కూడా భోజనం చేశాడు. కొడుకులను పిలిచి మాట్లాడుతానని.. ఇల్లు తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి పోలీసు ఆఫీసర్లు ఉంటే దేశం బాగుపడుతుందని.. సత్వర న్యాయం జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు.

Next Story