- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుక్కి దున్నేందుకు వృద్ధుల కష్టాలు...వాళ్ళను చూస్తే కన్నీళ్లు ఆగవు !
భారతదేశంలో వ్యవసాయం ( Agriculture) ఎక్కువ చేస్తారన్న సంగతి తెలిసిందే. దాదాపు 60 శాతం మంది ఈ వ్యవసాయంపైనే ఆధారపడి

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో వ్యవసాయం ( Agriculture) ఎక్కువ చేస్తారన్న సంగతి తెలిసిందే. దాదాపు 60 శాతం మంది ఈ వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటారు. అయితే ఈ వ్యవసాయదారుల కోసం కేంద్ర అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకువస్తున్నాయి. అయినప్పటికీ రైతుల కష్టాలు ఏమాత్రం తీరడం లేదు. పెట్టుబడి సహాయానికి... అప్పులు కూడా తెచ్చి పెట్టాల్సి వస్తోంది.
పంట పండించిన తర్వాత.. మద్దతు ధర లేక రైతులు సతమతమవుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ రైతు కుటుంబం పడుతున్న ఇబ్బందులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంబాదాస్ పవర్ 70 ఏళ్ల రైతు.. డబ్బులు లేక.. తానే కాడెద్దులాగా మారిపోయి తన దుక్కి దున్నుకుంటున్నాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని హడాల్టి గ్రామానికి చెందిన అంబదాస్ పవర్ (Ambadas Pawar) అనే 70 ఏళ్ల రైతుకు 2.5 ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమిలో.. పంట పండించేందుకు డబ్బులు మాత్రం అంబదాస్ చేతుల్లో లేవు. అయినప్పటికీ అప్పు తీసుకువచ్చి విత్తనాలు నాటాడు. ఇక విత్తనాలు మొలవగా... గడ్డి విపరీతంగా మొలిచింది.
అయితే ఆ గడ్డి తొలగించేందుకు అంబాదాసే కాడెద్దు లాగా మారిపోయాడు. బయట వాళ్లకు చెబితే కచ్చితంగా.. కూలీ ఇవ్వాల్సి ఉంటుంది. అతని దగ్గర దున్నేందుకు ఎద్దులు కూడా లేవు. దీంతో... కాడెద్దు తరహాలో నాగలి పట్టాడు అంబదాస్. అటు ఆయన భార్య వెనుక నుంచి నాగలి నడిపారు. అలా తన భూమి మొత్తం కలుపు మొక్కలు తీసేందుకు అంబదాస్ పవర్ (Ambadas Pawar) దంపతులు కష్టపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఎమోషనల్ అవుతున్నారు. డబ్బులు లేకపోయినా 70 ఏళ్ల వయసులో... గొడ్డులా పనిచేస్తున్నాడని అంటున్నారు. అంబదాస్ కు ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






