Viral Road : బాబోయ్.. బీహార్‌లో ఏదైనా సాధ్యమే! మినీ పార్కు కాదు.. ప్రధాన రహదారి.. వైరల్

by Ramesh Naini |

దేశంలో వందల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేసిన నెల రోజుల్లో గుంతలు పడే నాసిరకమైన రోడ్లను చూసే ఉంటారు.

Viral Road : బాబోయ్.. బీహార్‌లో ఏదైనా సాధ్యమే! మినీ పార్కు కాదు.. ప్రధాన రహదారి.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (viral news) దేశంలో వందల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేసిన నెల రోజుల్లో గుంతలు పడే నాసిరకమైన రోడ్లను చూసే ఉంటారు. రోడ్ల నిర్మాణ సమయంలో అడ్డుగా ఉన్న.. ఇరువైపుల ఉన్న చెట్లు కొట్టేస్తారు. లేదంటే వాటికి రక్షణగా దిమ్మెలు వంటివి ఏర్పాటు చేస్తారు. కానీ బీహార్‌లో అందుకు భిన్నంగా ఓ రోడ్డు నిర్మాణం జరిగింది. (gaya, patna road) పట్నా- గయా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రూ.100 కోట్ల వ్యయంతో రహదారి వేశారు కానీ.. మధ్యలో చెట్లను అలాగే వదిలేశారు. దీంతో ఒక మినీ పార్కుగా రహదారి తలపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలెందుకు చెట్లను వదిలేశారని అధికారులను స్థానిక ప్రజలు అడిగితే.. ఫారెస్ట్ ఆఫీసర్స్ అనుమతివ్వలేదంటూ సమాధానం చెప్పడంతో ప్రజలు షాక్‌ అయ్యారు. ఈ చెట్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వానికి ప్రజలు విజ్ఞప్తి చేశారు.

వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలో సంబంధిత అధికారులు రూ.100 కోట్లతో 7.48 కిలోమీటర్ల పట్నా- గయా ప్రధాన రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. (Jehanabad) జహానాబాద్ వద్ద రోడ్డు మధ్యలో చెట్లు రావడంతో, వాటిని తొలగించేందుకు అటవీశాఖను అధికారులు అనుమతి కోరారు. అందుకు చెట్ల తొలగింపునకు నిరాకరించి, దీనికి ప్రతిగా 14 హెక్టార్ల అటవీ భూమిని పరిహారంగా అటవీశాఖ డిమాండ్ చేసినట్లు తెలిసిందే. దీంతో జిల్లా యంత్రాంగం చెట్ల చుట్టూ రోడ్డు వేసుకుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు ఆశ్చర్యానికి లోనయ్యారు. బాబోయ్.. బీహార్‌లో ఏదైనా సాధ్యమేనని కామెంట్స్ పెడుతున్నారు.

Next Story