ఆలయంలో పూజారుల అశ్లీల నృత్యాలు..వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

సాధారణంగా పూజారులు భక్తులకు మంచి మాటలు చెబుతూ మంచి మార్గంలో వెళ్లాలని చెబుతుంటారు. ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ చాలా పద్ధతిగా ఉంటారు.

ఆలయంలో పూజారుల అశ్లీల నృత్యాలు..వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పూజారులు భక్తులకు మంచి మాటలు చెబుతూ మంచి మార్గంలో వెళ్లాలని చెబుతుంటారు. ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ చాలా పద్ధతిగా ఉంటారు. కానీ తమిళనాడులోని ఓ ఆలయంలో పూజారులు చేసినపని భక్తులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పద్ధతిగా పూజలు చేయాలల్సిన పూజారులు ఏకంగా ఆలయంలోనే వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది. త‌మిళ‌నాడులోని శ్రీవిల్లీపుత్తూరు పెరియ మ‌రియ‌మ్మ‌న్ ఆల‌యంలో ముగ్గురు పూజారులు టీవీలో పాట‌లు పెట్టుకుని అశ్లీల నృత్యాలు చేశారు.

అక్క‌డితో ఆగ‌కుండా ద‌ర్శ‌నానికి వ‌చ్చిన భ‌క్తుల‌పై విబూది చ‌ల్లుతూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో ఘ‌ట‌న‌పై అధికారులు సీరియ‌స్ అయ్యారు. ముగ్గురు పూజారుల‌ను స‌స్పెండ్ చేశారు. సోష‌ల్ మీడియాలో వీడియో చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో నెటిజ‌న్లు కూడా పూజారుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కొద్దిరోజులు మాత్ర‌మే స‌స్పెండ్ చేయ‌కుండా పూర్తిగా తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story