Viral video: కుక్కలతో కాదు.. వీళ్లతోనే యమ డేంజర్.. అసలేం జరిగిందో చూడండి!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-09 12:03:18  IST  )

ఇటీవల కాలంలో పల్లెల నుంచి పట్టణాల వరకు వీధి కుక్కల స్వైర విహారం విపరీతంగా పెరిగిపోయింది.

Viral video: కుక్కలతో కాదు.. వీళ్లతోనే యమ డేంజర్.. అసలేం జరిగిందో చూడండి!
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో పల్లెల నుంచి పట్టణాల వరకు వీధి కుక్కల (Street Dogs) స్వైర విహారం విపరీతంగా పెరిగిపోయింది. నిత్యం ఎక్క డో ఒక చోట మనుషులపై దాడి చేసి గాయపరుస్తూనే ఉన్నాయి. రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ పాదచారులు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడించి మరీ కరుస్తున్నాయి. అంతే కాదు, కొన్ని సందర్భాల్లో ఇళ్లలోకి దూరి దాడి చేస్తున్న ఘటనలు కూడా మనం అనేకం చూస్తున్నాం. దీంతో కుక్కలు కనిపిస్తేనే భయపడిపోతున్నాం. అయితే, కుక్కల కంటే కూడా కుక్కలను ఇష్టపడే (Dog Lovers) వారితో జాగ్రత్తగా ఉండాలని తాజాగా నెట్టింట వైరల్ (Viral in Social media) అవుతున్న వీడియో చూస్తే అర్థమవుతుంది. అసలేం జరిగిందంటే?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ రెసిడెన్షీయల్ ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్‌ ముందు వాచ్‌మెన్ నిలుచుని ఉన్నాడు. అక్కడి ఓ వ్యక్తి వచ్చి వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నాడు. ఆహారం కోసం వీధి కుక్కలన్నీ ఒక్కొక్కటిగా గుంపులుగా అక్కడి వచ్చాయి. అయితే ఇంతలో ఆ కుక్కలు వాచ్‌మెన్‌పైకి దాడి చేయటం ప్రారంభించాయి. దీంతో ఆ వాచ్‌మెన్ అతడి చేతిలోని కర్రతో వాటి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన సదరు వ్యక్తి వాచ్‌మెన్‌కు సాయం చేయాల్సింది పోయి.. ఒక్కసారిగా వాచ్‌మెన్ దగ్గరికి వచ్చి కుక్కలను కొట్టినందుకు దాడి చేశాడు. కుక్కలు అతడిని కరిచేందుకు వస్తున్న పట్టించుకోకుండా దారుణంగా కొట్టాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వటంతో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

జంతువులను ఇష్టపడటంలో తప్పులేదు. మూగ జీవాలు కాబట్టి వాటికేం తెలియక దాడి చేస్తాయి. కానీ, దాడి చేస్తున్న కూడా వాటిని ఏం అనకూడదు అనటం సరైనది కాదు. జంతుప్రేమికులు ఈ విషయాన్ని గుర్తించాలని ఈ వీడియో చూసిన నెజిటన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story