పర్యాటకం కాదు.. బెదిరింపు ప్రయాణం.. కోల్‌కతాలో అమెరికన్ వ్లాగర్‌కు షాకింగ్ అనుభవం!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-03 15:16:56  IST  )

భారత్‌లోని పర్యాటక అందాలను వీక్షించాలని వచ్చిన ఓ అమెరికన్ వ్లాగర్‌కు ఊహించని షాకింగ్ ఘటన ఎదురైంది.

పర్యాటకం కాదు.. బెదిరింపు ప్రయాణం.. కోల్‌కతాలో అమెరికన్ వ్లాగర్‌కు షాకింగ్ అనుభవం!
X

దిశ, వెబ్ డెస్క్: భారత్‌లోని (India) పర్యాటక అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన ఓ అమెరికన్ వ్లాగర్‌కు (American vlogger) ఊహించని షాకింగ్ అనుభవం ఎదురైంది. సాంస్కృతిక వైవిధ్యం, ఆతిథ్య సంప్రదాయాలు, మానవత్వంతో కళకళలాడే మన దేశంలో ఈ వ్లాగర్‌కి మొదటి రోజే చేదు జ్ఞాపకంగా మొదలైంది. మధురమైన ట్రావెల్ డైరీకి బదులుగా, ఒక భయానక ప్రయాణం అతడి మొదటి అడుగునే వెనక్కి నెట్టి వేసింది. కోల్‌కత్తా (Kolkata) ఓ ట్యాక్సీ డ్రైవర్ అమెరికాకు చెందిన ఓ వ్లాగర్‌ను తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు తన యూట్యూబ్ (Youtube) ఛానల్‌లో అప్‌లోడ్ చేయగా.. వైరల్‌గా (Viral) మారింది.

అమెరికాకు చెందిన డస్టిన్ అనే అమెరికన్ వ్లాగర్ కోల్‌కత్తా పర్యాటనకు వచ్చాడు. కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డస్టిన్ పార్క్ స్ట్రీట్‌లోని గ్రేట్ వెస్టర్న్‌ హోటల్‌కు వెళ్లేందుకు స్థానికంగా ఓ టాక్సీ మాట్లాడుకున్నాడు. ప్రయాణ ప్రారంభమైన కొద్దిసేపటికే అతన్ని డ్రైవర్ దారితప్పించి, దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని రాజార్హాట్ ప్రాంతంలోని ది వెస్టిన్ అనే వేరే హోటల్‌కి తీసుకెళ్లాడు. పైగా డ్రైవర్ తప్పిందం ఏం లేనట్లుగా.. మొదట రూ.700కు మాట్లాడుకున్న రూ.900 డిమాండ్ చేశాడు.

ఈలోగా మరో వ్యక్తి కారులోకి ఎక్కి, మధ్యవర్తిగా నటించినప్పటికీ, వెంటనే బెంగాలీలో తీవ్రంగా బెదిరించడం ప్రారంభించాడు. 'నాకు మాఫియా సంబంధాలు ఉన్నాయి, ఎక్కడో ఒంటరిగా తీసుకెళ్లి ఎముకలు విరుస్తాను' అంటూ హెచ్చరించాడు. అయినప్పటికీ డస్టిన్ ధైర్యంగా రూ.700కే ఒప్పుకున్నామని పట్టుదలగా చెప్పాడు. తరువాత వాళ్లు అతన్ని మరో టాక్సీలో వెళ్లేలా ఒప్పించి, బయటికి పంపారు. కానీ అక్కడ కూడా వదలకుండా 'పార్కింగ్, పెట్రోల్' పేరిట మరో రూ.100 తీసుకున్నారు. అందులో కొత్త డ్రైవర్‌కు కేవలం రూ.400 మాత్రమే ఇస్తున్నామని మాట్లాడుతుండగా డస్టిన్ తన వీడియోలో రికార్డ్ చేశాడు.

ఇక్కెప్పుడు విమానాశ్రయం నుంచి ఉబర్ తప్ప వేరే ట్యాక్సీలను ఎంచుకోనని తెలిపాడు. అతను ప్రయాణం ప్రారంభమైన 5 నిమిషాలకే అతడిపై రూ.150 పార్కింగ్ ఫీజు వేశారని కూడా అసహనం వ్యక్తం చేశాడు. అయితే, ఈ సంఘటన తన మొత్తం భారత పర్యటనను ప్రభావితం చేయలేదని డస్టిన్ స్పష్టం చేశాడు. భారతదేశాన్ని పర్యటనకు అద్భుతమైన దేశంగా భావిస్తున్నట్టు చెప్పాడు. ఈ దృశ్యాలను డస్టిన్ రహస్యంగా వీడియోలో రికార్డ్ చేసి, తన యూట్యూబ్ ఛానల్ Meet Dustinలో పోస్ట్ చేయగా.. అది క్షణాల్లో వైరల్ అయింది. ఓ విదేశీ అతిథిని ఇలా మోసం చేయడమంటే దేశ ప్రతిష్ఠకే మచ్చ అని తీవ్రంగా స్పందిస్తున్నారు.

వీడియో వైరల్ కావడంతో బిధన్‌నగర్ పోలీసులు స్పందించి ఇద్దరిని అరెస్టు చేశారు. డ్రైవర్ అలంగీర్ మొల్లా (34), అతడి సహచరుడు మనోజ్ కుమార్ రాయ్ (52)లపై బెదిరింపు, మోసం, క్రిమినల్ కుట్ర కేసులు నమోదు చేశారు. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

Next Story