మనుషులకే కాదు.. జంతువులకూ ఎమోషన్స్ ఉంటాయి.. నెట్టింట్లో హాట్ టచింగ్ వీడియో

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-29 12:33:01  IST  )

భావోద్వేగాలు.. మానువుల్లోనే కాదు, జంతువుల్లోనూ (Animal) కనిపిస్తాయి. జంతువుల్లో కనిపించే ఆప్యాయత, కృతజ్ఞత మనుషులకు మించినదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మనుషులకే కాదు.. జంతువులకూ ఎమోషన్స్ ఉంటాయి.. నెట్టింట్లో హాట్ టచింగ్ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: భావోద్వేగాలు.. మానువుల్లోనే కాదు, జంతువుల్లోనూ (Animal) కనిపిస్తాయి. జంతువుల్లో కనిపించే ఆప్యాయత, కృతజ్ఞత మనుషులకు మించినదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలను (Videos) మనం నిత్యం సోషల్ మీడియాలో (Social media) చూస్తునే ఉంటాం. తాజాగా అలాంటి హృదయాన్ని తాకే ఓ అద్భుతమైన వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా కళ్లలో నీరు తెచ్చుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో సంరక్షుడు చింపాజీలకు ఆహారం తీసుకుని వచ్చాడు. అందులో ఓ చింపాంజీ అతడిని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. వెంటనే అతడి దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది. ఆ క్షణం చూసిన ప్రతి ఒక్కరి మనసూ తడిచేలా చేసింది. విషయం ఏమిటంటే.. తనను ఎన్నో ఏళ్ల క్రితం ప్రాణాపాయంలో నుంచి కాపాడాడు. చాలా కాలం తర్వాత అతడు కనిపించే సరికి ఎమోషనల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. 'జంతువుల్లో ఉండే ప్రేమను మనం తక్కువగా అంచనా వేస్తున్నాం' అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story