- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఒక్క పబ్లిక్ టాయిలెట్ కూడా లేదు’.. భారత్‌లో ఇజ్రాయెల్ యువతి ఆవేదన!

దిశ, వెబ్‌డెస్క్: భిన్న సంస్కృతులకు కేంద్ర బిందువైన భారతదేశం (India)లో ప్రకృతి సౌందర్యాన్ని కనులారా వీక్షించాలని ఆశగా వచ్చిన ఓ ఇజ్రాయెల్ (Israel) పర్యాటకురాలికి ఉత్తరాఖండ్‌లో గడ్డు పరిస్థితి ఎదురైంది. కనీస సౌకర్యాలైన పబ్లిక్ టాయిలెట్లు కూడా అందుబాటులో లేకపోవడంపై ఆమె సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
అసలే ఏం జరిగిందంటే..
ఇజ్రాయెల్ నుంచి వచ్చిన యువతి ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ప్రసిద్ధ అల్మోరా (Almora) మార్కెట్ ప్రాంతాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆమెకు అత్యవసరంగా టాయిలెట్ అవసరం పడగా, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఒక్క పబ్లిక్ టాయిలెట్ కూడా కనిపించలేదు. మార్కెట్ అంతా వెతికినా సౌకర్యం లేకపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బంది పడ్డారు. చివరకు ఒక చిన్న హోటల్ యజమానిని అడిగి అక్కడి టాయిలెట్‌ను వాడుకోవాల్సి వచ్చింది. అయితే, తనకు ఎదురైన ఈ అనుభవాన్ని వివరిస్తూ ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘భారతదేశం చాలా అందమైన దేశం, కానీ పర్యాటక ప్రాంతాల్లో కనీసం టాయిలెట్లు కూడా లేకపోవడం బాధాకరం’ అని కామెంట్ చేశారు. అయితే, ఆ వీడియో చూసిన కొందరు నెటిజెన్లు ‘పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి మౌలిక సదుపాయాల లోపం’ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తోందని కామెంట్ చేస్తున్నారు.






