- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలయంలో ఇన్ఫ్లుయెన్సర్ అతి చేష్టలు.. 18 పూజలతో శుద్ధి చేసిన అర్చకులు
కేరళలోని త్రిన్సూర్‌లో గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయంలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేయడంతో అర్చకులు శుద్ధి చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్, సోషల్ మీడియా స్టార్ అయిన జాస్మీన్ జాఫర్ చీరలో

దిశ, వెబ్ డెస్క్: కేరళలోని త్రిన్సూర్‌లో గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయంలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేయడంతో అర్చకులు శుద్ధి చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్, సోషల్ మీడియా స్టార్ అయిన జాస్మీన్ జాఫర్ చీరలో ఆలయానికి వచ్చి రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాకుండా అక్కడి కోనేరులో తన పాదాలను కడుక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా జాస్మీన్ జాఫర్ హిందువు కాకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. పలువురు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆలయ నిర్వాహకుడు ఓ.బి అరుణ్ కుమార్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి ఇన్ఫ్లుయెన్సర్ పై ఫిర్యాదు చేశారు.
ఆలయంలో ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధం అని పేర్కొన్నారు. దీంతో జాఫర్ ఆ ఆలయంలో వీడియోలు తీయడంపై ఆంక్షలు ఉన్నట్టు తనకు తెలియదని, క్షమాపణలు చెబుతూ వీడియోను డిలీట్ చేసింది. అయినప్పటికీ ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరమతస్తురాలు కావడంతో ఆలయ అధికారులు 18 పూజలు చేసి ఆలయాన్ని శుద్ధి చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరు రోజుల పాటు దర్శనంలో ఆంక్షలు ఉంటాయన్నారు. ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుందని, ఆ తరవాత ఎవరూ ఆలయానికి రావద్దని సూచించారు.






