- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవరాత్రి అని వెజ్ ఆర్డర్ ఇస్తే.. చికెన్ బిర్యానీ వచ్చింది! రెస్టారెంట్ యజమాని అరెస్ట్
గ్రేటర్ నోయిడాలో వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే.. తనకు చికెన్ బిర్యానీ వచ్చిందని ఆరోపిస్తూ ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రేటర్ (Noida) నోయిడాలో వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే.. తనకు చికెన్ బిర్యానీ వచ్చిందని ఆరోపిస్తూ ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని సెక్టార్ 1లోని అరిహంత్ ఆర్డెన్ నివాసి అయిన (Chhaya Sharma) ఛాయా శర్మ ఏప్రిల్ 4న సోషల్ మీడియాలో బిర్యానీ ప్యాకెట్‌తో కూడిన వీడియోను పోస్ట్ చేసింది. ఆమె స్విగ్గీ (Swiggy) ద్వారా స్థానిక లఖ్నవి కబాబ్ రెస్టారెంట్ నుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసినట్టు వీడియోలో తెలిపారు. ‘నేను పూర్తిగా శాఖాహారిని, మరోవైపు నవరాత్రి, కాబట్టి వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. నేను కొన్ని చెంచాలు తిన్న తర్వాత కొన్ని చికెన్ ముక్కలు కనిపించాయి. వెంటనే వాటిని నేను ఉమ్మివేశాను. నేను జీవితంలో ఎప్పుడు నాన్ వెజ్ తినలేదు’ అంటూ ఆమె వీడియోలో బిర్యానీ ప్యాకెట్ చూపించి.. ఏడ్చింది. అలాగే రెస్టారెంట్‌కు కాల్ చేయడానికి ప్రయత్నిస్తే సమాధానం రాలేదని చాయా ఆరోపించింది.
ఇక, రెస్టారెంట్ యజమానిపై యువతి ఛాయా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సెంట్రల్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శక్తి అవస్థి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్ యాజమాని రాహుల్ రఘువంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఆమె నుంచి హోటల్ నుంచి కొన్ని ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపారు. ఫుడ్ పరీక్ష ఫలితాలు, ఇతర ఆంశాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని నోయిడాలోని ఫుడ్ సేఫ్టీ అధికారి సర్వేష్ కుమార్ తెలిపారు.
యువతి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. నవరాత్రి సమయంలో చాలా మంది హిందువులు నాన్ వెజ్ తినరని నెటిజన్లు ఆ ఛాయా శర్మపై సానుభూతిని తెలియజేశారు. మరికొంత మంది మాత్రం యువతిని తప్పుబట్టారు. నవరాత్రి సమయంలో ప్రసిద్ధి చెందిన నాన్-వెజ్ రెస్టారెంట్ నుంచి వెజ్ బిర్యానీని ఆర్డర్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆ సమయంలో స్వచ్చమైన వెజ్ రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసి ఉండాలని ఉద్దేశపూర్వకంగానే రెస్టారెంట్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఇలా చేసి ఉంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే కస్టమర్‌పై చర్య తీసుకోవాలని నెటిజన్లు యూపీ పోలీసులకు డిమాండ్ చేశారు.






