- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ టీచర్‌ని చూస్తే ఏ స్టూడెంటూ వదిలిపెట్టడు.. చూస్తే ఎవరైనా అబ్బా.. అనాల్సిందే.. (వీడియో)
వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు మళ్లీ పాఠశాలల బాట పట్టారు. ఎన్ని రోజులు హాలీడేస్ ఎంజాయ్ చేసినా..

దిశ, వెబ్ డెస్క్:వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు మళ్లీ పాఠశాలల బాట పట్టారు. ఎన్ని రోజులు హాలీడేస్ (Holidays) ఎంజాయ్ చేసినా.. చివరికి పుస్తకాలు, బ్యాగులు, బస్సుల సందడి మొదలైంది. హైస్కూల్ విద్యార్థులు అయితే నార్మల్‌గా స్కూల్‌కి వెళ్లిపోతారు. కానీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లల సంగతి మాత్రం వేరే! ఈ వయసులో పిల్లల్ని స్కూల్‌కి (School) పంపడం ఓ అల్లరి సినిమానే చూడాల్సి వస్తుంది. స్కూల్ గేట్ దగ్గర కన్నీళ్లు, అమ్మను వదలని మొహాలు, ఉపాధ్యాయులను చూసి భయపడే చూపులు.. ఇవన్నీ సాధారణం. కానీ, కర్ణాటకలోని (Karnataka) ఓ పాఠశాలలో మాత్రం సీన్ బాగా డిఫరెంట్‌గా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో (Video) కూడా ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. మరీ ఈ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన ఓ పాఠశాలలో వందన రాయ్ అనే ఉపాధ్యాయురాలు తమ ఎల్‌కేజీ పిల్లల మొదటి రోజు స్కూలు వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) షేర్ చేసింది. మొదటి రోజు అంటే ఎవరైనా ఏడుస్తారు.. కానీ ఈ టీచర్ పిల్లల్లో మాత్రం కొంచెం కూడా బెరుకు, భయం లేదు. అందరి ముఖాల్లో కూడా ఉత్సాహం, ఆనందం, నవ్వులు మాత్రమే కనిపించాయి. ఇందుకు కారణం.. వందన రాయ్ టీచర్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఆమె డ్యాన్స్ చేస్తూ పిల్లలతో ఉత్సాహంగా డ్యాన్స్ చేయించారు. పిల్లలకు స్కూలు అంటే భయం ఉండకూడదని, వాళ్లు ఇష్టంగా రావాలని ఆమె మొదటి రోజు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, వందన రాయ్ విద్యాబోధన కూడా ఆడుతూ పాడుతూ వినూత్నంగా చేస్తుంటారు. దీంతో పిల్లలకు ఎంతో ఇష్టమైన టీచర్‌గా నిలిచారు.






