- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా నో పెట్రోల్..అన్వేష్ వీడియో వైరల్
చైనా నో పెట్రోల్ అంటూ అన్వేష్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు యూట్యూబ్ లో అన్వేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా సమయంలో యూట్యూబర్ గా మారిన అన్వేష్... ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నాడు. ఇప్పటికే వందకు పైగా దేశాలు తిరిగిన యూట్యూబర్ అన్వేష్, ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నాడు. గతంలో చైనాకు వెళ్లి ట్రోలింగ్ కు గురైన అన్వేష్, ఇప్పుడు మళ్లీ అదే సాహసం చేశాడు. ఈ పర్యటనలో అక్కడి అభివృద్ధిని చూపిస్తూ... ఇండియన్స్ ఇంకా నేర్చుకోవాలని తన వీడియోలలో అన్వేష్ హితువు పలుకుతున్నాడు.
ఇక లేటెస్ట్ గా చైనాలో పెట్రోల్ పరిస్థితిపై కూడా ఓ వీడియో తీశాడు. ప్రస్తుతం చైనా దేశంలో పెట్రోల్ వాడడం లేదని వెల్లడించాడు. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నట్లు పేర్కొన్నాడు. ఎలక్ట్రిక్ టూవీలర్ తో పాటు.. బస్సులు, హేవీ వెహికిల్స్ వాడేస్తున్నారని స్పష్టం చేశాడు.
అన్ని రంగాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తూ... పెట్రోల్ పూర్తిగా తగ్గించేసారని వివరించాడు అన్వేష్. ప్రస్తుతం చైనాలో పొల్యూషన్ పూర్తిగా తగ్గిపోయిందని కూడా ప్రూఫ్ చూపించాడు. చైనా తరహాలో ఇండియాలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఎంకరేజ్ చేయాలని డిమాండ్ చేశాడు. అప్పుడే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని తెలిపాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.






