- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిజిటల్ పేమెంట్స్ వద్దు బాబోయ్..! క్యూర్ కోడ్స్‌ను చించేస్తున్న చిరు వ్యాపారులు
డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) వినియోగదారులతో పాటు వ్యాపారుల పనిని సులువు చేశాయి.

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) వినియోగదారులతో పాటు వ్యాపారుల పనిని సులువు చేశాయి. ముఖ్యంగా చిల్లర తిరిగి ఇచ్చేందుకు ఒకప్పుడు వ్యాపారులు ముప్పుతిప్పలు పడుతుండేవారు. వినియోగదారుల చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. ఎంత పెద్ద షాపింగ్ అయిన చిటికెలో పేమెంట్స్ చేసేస్తున్నారు. కానీ, డిజిటల్ పేమెంట్స్‌ను నమ్ముకున్న కర్ణాటక (Karnataka) చిరు వ్యాపారుల పరిస్థితి మాత్రం రోటిన్‌కు భిన్నంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. హావేరి (Haveri) ప్రాంతంలోని మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్ సమీపంలో గత నాలుగేళ్లుగా శంకర్ గౌడ (Shankar Gouda) అనే వ్యక్తి కూరగాయలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి దగ్గరికి వచ్చే కస్టమర్లకు ఇబ్బంది కలుగకుండా యూపీఐ పేమెంట్ సదుపాయాన్ని సమకూర్చుకున్నాడు. కానీ, ఇటీవలే శంకర్ గౌడకు ఊహించని షాక్ తగిలింది.
గత నాలుగేళ్లలో కూరగాయల షాప్‌లో డిజిటల్ పేమెంట్స్ కింద రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగాయని, ఈ మేరకు రూ.29 లక్షలు జీఎస్టీ (GST) కింద చెల్లించాలని ఇటీవలే అధికారులు నోటీసులు జారీ చేశారు. తాను చిరు వ్యాపారం నడుపుతున్నానని.. ఉన్నట్టుండి అంత డబ్బు కట్టమంటే ఎలా కట్టగలుగుతానని కామెంట్ చేశాడు. అయితే, శంకర్ గౌడకు నోటీసులు ఇచ్చారనే విషయం కర్ణాటక రాష్ట్రంలో దావానంలా వ్యాపించింది. దీంతో చిరు వ్యాపారులు తాము నడుపుతున్న షాపుల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్స్ (QR Codes) చించేస్తూ.. డిజిటల్స్ మాకొద్దు బాబోయ్ అంటూ దండం పెడుతున్నారు.
వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://x.com/1vinci6le/status/1947349618716762393






