- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral : డిగ్రీ వద్దు.. రెజ్యూమ్ వద్దు.. నైపుణ్యాన్ని నిరూపించుకోండి.. కోటి రూపాయల జీతం తీసుకోండి..!
Viral : డిగ్రీ వద్దు.. రెజ్యూమ్ వద్దు.. నైపుణ్యాన్ని నిరూపించుకోండి.. కోటి రూపాయల జీతం తీసుకోండి..!

దిశ, ఫీచర్స్ : ఏదైనా ఉద్యోగం సంపాదించాలంటే దానికి ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది. స్టడీ సర్టిఫికెట్లు పట్టుకొని ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సి ఉంటుంది. పైగా టెన్త్‌లో, డిగ్రీలో మార్కుల పర్సెంటేజ్‌ను బట్టి కూడా టాలెంట్‌ను అంచనా వేస్తుంటారు కొందరు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు అవేమంత ముఖ్యమైనవి కావు. మీరు ఎంత చదువుకున్నారు? ఎన్ని మార్కులు వచ్చాయి? డిగ్రీలో పర్సంటేజ్ ఎంత? రెజ్యూమ్ అందంగా ఉందా.. లేదా ? అనేవి జాబ్ మార్కెట్‌లో పనికొచ్చే అంశాలు ఏమాత్రం కావంటున్నాయి నేటి రిక్రూటర్స్. అచ్చం అలాంటి సంఘటనకు సంబంధించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
‘‘మీ డిగ్రీ అవసరం లేదు. రెజ్యూమ్ అవసరం లేదు. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ కూడా అవసరం లేదు. జస్ట్ స్కిల్స్ ఉంటే చాలు. టాలెంట్ నిరూపించుకోండి. కోటి రూపాయల జీతం తీసుకోండి’’ అంటూ స్మాలెస్ట్ ఏఐ అనే స్టార్టప్ సంస్థలో ఫుల్‌స్టాక్ ఇంజినీర్ పోస్ట్ కోసం బంపరాఫర్ ప్రకటించాడు బెంగుళూరుకు చెందిన సీఈఓ సుదర్శన్ కామత్(Sudarshan Kamath).. ఈ పోస్టును ఆయన తన ఎక్స్(x) ఖాతాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లలో చర్చకు దారితీస్తోంది. సాంప్రదాయ ఆధారాలు, అర్హతల కంటే ఈ రోజుల్లో నైపుణ్యాలకే కామత్ ప్రయారిటీ ఇవ్వడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. వాస్తవానికి అద్దంపట్టే ఈ నిర్ణయం భారతదేశంలోని రిక్రూట్‌మెంట్ కల్చర్(Recruitment culture)లో విప్లవాత్మక మార్పునకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. మార్కులకంటే నైపుణ్యానికే మంచి భవిష్యత్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. Link






