నెక్ట్స్ లెవల్ వెడ్డింగ్ కార్డ్.. ఈ పెళ్లి కార్డుతో మార్పు మొదలైందంటున్న పవన్ ఫ్యాన్స్

by Disha Web Desk 7 |
నెక్ట్స్ లెవల్ వెడ్డింగ్ కార్డ్.. ఈ పెళ్లి కార్డుతో మార్పు మొదలైందంటున్న పవన్ ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య పెళ్లిలే కాదు.. పెళ్లి కార్డ్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా శుభలేక ప్రింట్ చేయించుకుని పాపులర్ అవుతున్నారు. అయితే.. ఏపీకి చెందిన ఓ వ్యక్తి తన పెళ్లి కార్డును రాజకీయంగానూ ఉపయోగించుకున్నాడు. అంతే కాదు.. తన అభిమాన నాయకుడికి ఒక్క అవకాశం ఇవ్వాలని ‘మార్పునకు ఆహ్వానం’ పలుకుతున్నాడు. విషయానికి వస్తే...

తిరుపతికి చెందిన సనకా కైలాసవతి అనే వ్యక్తి తన ఏకైక పుత్రుడు వెంకట నాగ అనిల్ కుమార్ వివాహం సెప్టెంబర్-2న తిరుమలలో అంగరంగ వైభవంగా జరిపించారు. అయితే.. ఆ పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానించేందుకు ఆయన ప్రింట్ చేయించిన పెళ్లి కార్డు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీకి అభిమాని అయిన అనిల్ తన పెళ్లి కార్డును వినూత్నంగా ప్రింట్ చేయించారు. ముఖ్యంగా రాష్ట్రంలో మార్పు రావాలనే కాన్సెప్ట్‌తో బంధుమిత్రులను ఆలోచనలతో పడేసేలా పెళ్లి కార్డును రూపొందించాడు.

ఆహ్వాన పత్రికలో ఆహ్వానించువారు అని ఓ పక్క వారి పేర్లు ప్రింట్ చేయించుకుని.. మరో వైపు ‘‘ఒక్కసారి జననాయకుడు జనసేనాని వవన్ కల్యాణ్‌కు అవకాశం ఇద్దాం.. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం.. మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం’’ అంటూ జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. దీంతో ఈ పెళ్లికి వచ్చిన వారందరిలో దీనిపైనే చర్చ జరిగింది. మరోవైపు ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారడంతో ఈ వినూత్న కార్డును చూసిన నెటిజన్లు పెళ్లి కుమారుడిని అభినందిస్తున్నారు. మరికొందరు మీ పెళ్లి కార్డుతో ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైనట్టే అంటూ రకరకాలు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Read More: ఇది పెళ్లి కూతురు పేరేనా లేక ఇవన్ని ముద్దు పేర్లా.. వైరల్ అవుతున్న పెళ్లి కార్డు?



Next Story

Most Viewed