- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మ నా దొంగ.. నీ బ్యాటింగ్ మామూలుగా లేదుగా..
ఇండియాలో ( India) క్రికెట్ కు (Cricket) ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే చాలు.. అందరూ టీవీల ముందు

దిశ, వెబ్ డెస్క్: ఇండియాలో ( India) క్రికెట్ కు (Cricket) ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే చాలు.. అందరూ టీవీల ముందు కూర్చుంటారు. మరి కొంతమంది.. ఖాళీ దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడుతూ సందడి చేస్తూ ఉంటారు. అయితే.. క్రికెట్ పేరుతో ఓ కుర్రాడు చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెట్ బ్యాట్ ( Cricket bat ) పట్టుకొని... ఏకంగా ఓ బైక్ దొంగతనం ( theft) చేసేందుకు... కుట్ర పన్నాడు ఆ కుర్రాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు కానీ... వీడియో మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ చిన్న గల్లీలో.. కొన్ని బైకులు పార్క్ చేసి ఉన్నాయి. అయితే అందులో ఓ రెడ్ కలర్ బైక్ దొంగతనం చేయాలని... ఆ కుర్రాడు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఒక క్రికెట్ బ్యాట్ పట్టుకొని... ఆ బైక్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలు గమనించని ఆ కుర్రాడు... సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ధోని తరహాలో షాట్లు ఆడుతూ ఫోజులిచ్చాడు. వెనుక నుంచి మరో వ్యక్తి రాగానే... ఆ బైక్ తనదే అన్నట్లుగా.. దానిపైన కూర్చున్నాడు.
ఆ లోపే పైకి చూడగానే CC కెమెరాలు దర్శనమిచ్చాయి. ఇంకే ముంది తన ప్లాన్ మార్చుకున్నాడు. బైక్ అక్కడే పార్క్ చేసి ముఖం కనిపించకుండా బ్యాట్ అడ్డం పెట్టుకొని... అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో... నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మనోడి దొంగతనం ప్లాన్ అట్టర్ ఫ్లాఫ్ అయిందని కొంత మంది అంటుంటే... క్రికెట్ పేరుతో బైక్ దొంగిలించాలని ప్లాన్ వేశాడు అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ సీసీ కెమెరాలు లేకపోతే కచ్చితంగా బైక్ దొంగలించేవాడని... ఈ కొత్త ట్రిక్ దొంగతనం భలే ఉందని మరి కొంతమంది అంటున్నారు.






