పేరుతో గిన్నిస్ రికార్డు సాధించాడు.. ఎలాగంటే?

by Ajay Maddhiboyina |

ఓ వ్యక్తి డిఫరెంట్‌గా ఆలోచించి పెద్దగా కష్టపడకుండానే లిమ్ కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. కేవలం తన పేరును పెద్దగా పెట్టుకుని ఈ రికార్డు సాధించాడు. న్యూజిలాండ్‌కు చెందిన వ్యక్తి తన పేరులో 2253 పదాలతో ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు.

పేరుతో గిన్నిస్ రికార్డు సాధించాడు.. ఎలాగంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. అది నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడతారు. అలా కొందరికి గిన్నిస్ బుక్ లో పేరు సంపాదించుకోవడం అంటే చాలా ఇష్టం. అలా పేరు దక్కించుకోవాలి అనుకుంటే అంత సులభం కాదు. ప్రపంచంలోనే ఎవ్వరూ చేయలేని పనిచేయాలి. లేదంటే అప్పటికే గిన్నిస్ బుక్‌లోకి ఎక్కినవారి రికార్డును బ్రేక్ చేయాలి. అయితే ఈ రికార్డులు కూడా కొన్నిసార్లు చాలా వింతగా, సిల్లీగా ఉంటాయి. ఎవ్వరూ చేయని పని, చేయలేని పని ఏది చేసి ఓ రికార్డే.

అలానే ఓ వ్యక్తి డిఫరెంట్‌గా ఆలోచించి పెద్దగా కష్టపడకుండానే లిమ్ కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. కేవలం తన పేరును పెద్దగా పెట్టుకుని ఈ రికార్డు సాధించాడు. న్యూజిలాండ్‌కు చెందిన వ్యక్తి తన పేరులో 2253 పదాలతో ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇంత పెద్ద పేరు పెట్టుకునేందుకు ఆటంకాలు రాగా పట్టుబట్టి న్యాయపోరాటం చేసి మరీ అదే పేరు పెట్టుకున్నాడు. ఇక అతడు కోరుకున్నట్టుగానే పెద్ద పేరు గిన్నిస్ రికార్డును తెచ్చిపెట్టింది. మరి అంత పెద్దపేరు రాస్తే గిన్నిస్ బుక్ లో ఎన్నిపేజీలు అయిపోతాయో అన్న ప్రశ్న మొదలైంది.

Next Story