- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొట్టపై స్కాన్ చేస్తే ఫోన్‌లో బిడ్డను చూడొచ్చు.. ఈ టెక్నాలజీ బలే ఉందిగా
తాజాగా నెట్టింట ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో స్కానింగ్ పరికరంతో పొట్టపై స్కాన్ చేయగానే పొట్టలోని బిడ్డ ఎలా ఉందో ఫోన్ లో కనిపిస్తోంది. అచ్చం స్కానింగ్ సెంటర్ లో కంప్యూటర్ లో చూపించిన మాదిరిగానే ఫోన్ లో బిడ్డ కనిపిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బిడ్డ ఎదుగుదల చూసేందుకు తరచూ స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. బిడ్డ ఎదుగుదలను బట్టి డాక్టర్ మందులు సూచిస్తూ ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే ముందుగానే గుర్తించి నయం చేసేందుకు మందులను కూడా ఇస్తారు. అయితే ఒక్కో స్కానింగ్ కు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా డయాగ్నోస్టిక్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అక్కడకు వెళితే గంటలు గంటలు వేచి చూసిన తరవాత స్కానింగ్ తీస్తారు. అంతే కాకుండా స్పెషలిస్ట్ ఆధ్వర్యంలోనే స్కానింగ్ చేస్తారు.
అయితే తాజాగా నెట్టింట ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో స్కానింగ్ పరికరంతో పొట్టపై స్కాన్ చేయగానే పొట్టలోని బిడ్డ ఎలా ఉందో ఫోన్ లో కనిపిస్తోంది. అచ్చం స్కానింగ్ సెంటర్ లో కంప్యూటర్ లో చూపించిన మాదిరిగానే ఫోన్ లో బిడ్డ కనిపిస్తోంది. అయితే ఇది ఏ దేశంలో అందుబాటులో ఉందో కానీ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమ స్టైల్ లో స్పందిస్తున్నారు.
ఇండియాలో మాత్రం ఇలాంటి టెక్నాలజీ వద్దు
ఇలాంటి టెక్నాలజీ ఇండియాలో మాత్రం తీసుకురావద్దని కోరుతున్నారు. మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆడబిడ్డ అని తెలిస్తే పురిటిలోనే చంపేస్తారని కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ హైలెట్ గా మారింది. అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా నాలుగు నెలల తరవాతనే బిడ్డను ఆడ మగ గుర్తించగలమని పేర్కొన్నాడు. అప్పుడు కేవలం హాస్పిటల్ లోనే అబార్షన్ చేయించాలని లేదంటే చనిపోతారని కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపాడు.






