VIDEO: ఆడవారికి గాజులు, మగవారికి బీర్లు... నిర్మల్ జిల్లాలో కొత్త ట్రెండ్

by Ajay Maddhiboyina |

నిర్మల్ జిల్లాలో స్నేహం బ‌లంగా ఉండాల‌నే ఆకాంక్ష‌తో మ‌హిళలు గాజులు మార్చుకుంటున్నారు.

VIDEO: ఆడవారికి గాజులు, మగవారికి బీర్లు... నిర్మల్ జిల్లాలో కొత్త ట్రెండ్
X

దిశ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలో కొత్త ట్రెండ్ మొదలైంది. అప్పట్లో వదినా మరదళ్ల గాజులు, మనవరాలు అమ్మమ్మ గాజులు ఇలా కొత్త కొత్త ఆచారాలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. అలా చేస్తేనే మంచి జరుగుతుందని లేదంటే చెడు జరుగుతుంది ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు స్నేహితులకు కూడా అలాంటిదే ఓ కొత్త ఆచారం నిర్మ‌ల్ జిల్లాలో మొద‌లైంది. స్నేహం బ‌లంగా ఉండాల‌నే ఆకాంక్ష‌తో మ‌హిళలు గాజులు మార్చుకుంటున్నారు.

మ‌హిళ‌లు గాజులు మార్చుకుంటే మేమేమైనా త‌క్కువ తిన్నామా అని పురుషులు ఏకంగా బీర్లు, క్వార్ట‌ర్ లు ఇచ్చిపుచ్చికుంటున్నారు. అంతే కాకుండా బొట్టు పెట్టుకుని ట‌వ‌ల్ క‌ప్పుకుని స‌న్మానాలు సైతం చేసుకుంటున్నారు. నిర్మ‌ల్ జిల్లాలోని సోన్ మండ‌లం సిద్ధుల కుంట‌, ల‌క్ష్మ‌ణ చాంద మండ‌లం క‌న‌కాపూర్ గ్రామాల్లో ఈ ట్రెండ్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. దీంతో అటు వైన్ షాపుల్లో మందుకు, ఇటు గాజుల షాపుల్లో గాజుల‌కు ఫుల్‌గా గిరాకీ అవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. video

Next Story