నన్ను తల్లిని చేయగలిగే పురుషుడు కావాలి.. రూ. 25 లక్షలు ఇస్తా.. మార్కెట్‌లో కొత్త స్కామ్‌

by Sujitha Rachapalli |

నన్ను తల్లిని చేయగలిగే పురుషుడు కావాలి.. రూ.25 లక్షలు చెల్లిస్తాను.. ఈ వీడియో చూసి కక్కుర్తిపడిన 44ఏళ్ల వ్యక్తి ఏకంగా రూ. 11 లక్షలు కోల్పోయాడు. ఈ స్కామ్‌లో చిక్కుకుని జీవితాన్ని తలకిందులు చేసుకున్నాడు. పూణేకు చెందిన 44 ఏళ్ల కాంట్రాక్టర్ సోషల్

నన్ను తల్లిని చేయగలిగే పురుషుడు కావాలి.. రూ. 25 లక్షలు ఇస్తా.. మార్కెట్‌లో కొత్త స్కామ్‌
X

దిశ, వెబ్ డెస్క్ : నన్ను తల్లిని చేయగలిగే పురుషుడు కావాలి.. రూ.25 లక్షలు చెల్లిస్తాను.. ఈ వీడియో చూసి కక్కుర్తిపడిన 44ఏళ్ల వ్యక్తి ఏకంగా రూ. 11 లక్షలు కోల్పోయాడు. ఈ స్కామ్‌లో చిక్కుకుని జీవితాన్ని తలకిందులు చేసుకున్నాడు. పూణేకు చెందిన 44 ఏళ్ల కాంట్రాక్టర్ సోషల్ మీడయాలో ఓ మహిళ సీరియస్ వాయిస్‌తో తనకు పురుషుడు కావాలని.. కలర్, క్యాస్ట్, ఎడ్యుకేషన్ అవసరం లేదని.. తల్లి అయితే చాలని చెప్పడంతో.. నిజమేనని అనుకున్నాడు. ప్రెగ్నెంట్ జాబ్ కంపెనీకి కాల్ చేసి.. తనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పాడు.

ఇక కాల్ లిఫ్ట్ చేసిన రిసెప్షనిస్ట్.. రిజిస్ట్రేషన్ ఫీ, ఐడీ కార్డ్ చార్జ్, వెరిఫికేషన్ ఫీజు, జీఎస్టీ, టీడీఎస్, ప్రాసెసింగ్ చార్జ్ అంటూ సవాలక్ష చెప్పి.. ప్రతిసారి పేమెంట్ చేయించుకున్నారు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 23 వరకు జరిగిన దాదాపు వందకు పైగా ట్రాన్స్‌జాక్షన్స్‌లో ఏకగ 11 లక్షలు పోగొట్టుకున్నాడు.

Next Story