- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తమను తామే తింటున్న ఆహార పదార్థాలు’.. సేవ్ చేయలేనంటున్న నెటిజన్లు(వీడియో)
ప్రస్తతం టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూస్తునే ఉన్నాం

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తతం టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూస్తునే ఉన్నాం. ఈ క్రమంలో ప్రజెంట్ అందరి జీవితాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కీలకంగా మారింది. చాట్‌జీపీటీ, గూగుల్ వియో, గ్రోక్ వంటి టూల్స్ మనం పనిచేసే విధానాన్ని, జీవించే విధానాన్ని ఎంతలా మారుస్తున్నాయో గమనిస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టికి విరుద్ధమైన వీడియోలను కూడా పలువురు రూపొందిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆశ్చకరమైన వీడియో వైరల్‌గా మారింది. పలు ఆహార పదార్థాలు తమను తామే తింటున్నట్లుగా ఉన్న ఓ ఏఐ వీడియో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో రైస్, లెమన్, స్ట్రాబెర్రి, ఆరెంజ్, జీడిపప్పు ఇలా పలు ఆహార పదార్థాలను వాటిని అవే తింటున్నట్లుగా కనిపిస్తున్నాయి. క్రియేట్ చేసిన ఈ వీడియో పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఈ వీడియో చూస్తే నాకు ఎందుకు సంతోషం కలిగిందో అర్థం కావడం లేదని ఒకరు, జీడిపప్పును తిననివ్వండి, కానీ అతనికి కొంత సహాయం కావాలి అని మరొకరు వ్యాఖ్యానించారు. నేను ఇప్పటివరకు చూసిన వీడియోలలో ఇదే అత్యంత భయంకరమైనది. “నువ్వు ఏమి తింటావో అదే నువ్వే” బ్రోకలీని సేవ్ చేయండి.. అతను చాలా చల్లగా ఉన్నాడు. నేను దేనినీ సేవ్ చేయకూడదు అనుకుంటున్నాను అంటూ నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి ఇది ఏఐ నా!? హమ్మయ్య బతికిపోయా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో AI వల్ల ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఏఐ అనేక ప్రయోజనాలు తెస్తున్నప్పటికీ, ఉద్యోగాలు, సమాజ భవిష్యత్తు పై తీవ్రమైన ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.






