What a Tlent: వినడం తప్ప చెప్పడానికి మాటలు లేవు (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-27 04:58:21  IST  )

ఒకప్పుడు టాలెంట్‌(Talent)ను నిరూపించుకోవనికి సరైన టైమ్, వేదిక కోసం ఎదురుచూసే వారు.

What a Tlent: వినడం తప్ప చెప్పడానికి మాటలు లేవు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు టాలెంట్‌(Talent)ను నిరూపించుకోవనికి సరైన టైమ్, వేదిక కోసం ఎదురుచూసే వారు.. ముఖ్యంగా డబ్బుంటే అన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కూడా ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు.. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో నిరూపించుకోవానికి అద్భుతమైన వేదికలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సోషల్ మీడియా(Social media). సింగర్‌గా రాణించాలనుకునే వారు.. స్పోర్ట్స్‌లో రాణించాలనుకునేవారు.. డాన్సులు చేసేవారు.. అద్భుతంగా డైలాగులు చెప్పేవారు.. వంట చేసేవారు.. ఇలా రోజూ ఎంతో మంది తమలోని టాలెంట్‌ను సోషల్ మీడియా వేదికగా బయటపెడుతూ అవకాశాలు దక్కించుకుంటున్నారు.

తాజాగా.. మరో వ్యక్తి సోషల్ మీడియా వేదికగా తనలోని టాలెంట్‌ను బయట పెట్టారు. ఫ్లూట్‌తో బొంబాయి సినిమాలోని ‘‘కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే.. నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే.. అందాల వయసేదో తేలి తామరై.. విరబూసే వలపేదో నాలో.. నీ పేరు నా పేరు తెలుసా మరి.. హృదయాల కథ మారే నీలో.. వలపందుకే కలిపేనులే.. ఒడిచేరె వయసేన్నాడో’’ అనే పాటను ఫ్లూట్‌తో వాయించారు. ఇది గమనించిన నెటిజన్లు ‘సూపర్ టాలెంట్ బ్రో’ అని కామెంట్స్ చేస్తున్నారు. వారికి ఇష్టమైన పాటలను కింద కామెంట్ల రూపంలో చెబుతూ వాయించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Next Story