- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క సెల్ఫీ.. ఆరు లక్షల మంది నుంచి ట్రోల్స్ .. ధీటుగా సమాధానమిచ్చిన లేడీ..
జాంబియాకు చెందిన లాయర్ నవోమీ పిలులా.. ఒక్క పోస్ట్‌తో భారీ హేట్ ఎదుర్కొంది. ఆమె రూపాన్ని విమర్శిస్తూ దాదాపు ఆరు లక్షల మంది ట్రోల్ చేశారు. కానీ ఆమె మాత్రం వీటన్నింటినీ లెక్క చేయలేదు. ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రూపం,

దిశ, వెబ్ డెస్క్ : జాంబియాకు చెందిన లాయర్ నవోమీ పిలులా.. ఒక్క పోస్ట్‌తో భారీ హేట్ ఎదుర్కొంది. ఆమె రూపాన్ని విమర్శిస్తూ దాదాపు ఆరు లక్షల మంది ట్రోల్ చేశారు. కానీ ఆమె మాత్రం వీటన్నింటినీ లెక్క చేయలేదు. ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రూపం, ఆత్మవిశ్వాసం గురించి గొప్పగా చెప్పి.. హేట్‌కు మించిన సపోర్ట్ అందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జూన్‌లో హ్యాపీ మండే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సెల్ఫీ పెట్టింది నవోమి. సహజమైన జుట్టు, చర్మాన్ని గర్వంగా చూపించింది. కానీ ఈ పోస్ట్‌కు సానుకూల స్పందనలు కరువయ్యాయి. ఆమె రూపాన్ని ముఖ్యంగా ముక్కును టార్గెట్ చేస్తూ విమర్శలు వచ్చాయి. ఒక్క పోస్ట్‌కు ఇంత హేట్ ఎలా అనేలా టార్గెట్ చేశారు. దీంతో కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఆమె ఇంటర్వ్యూను తీసుకున్నాయి. మీపై ట్రోలింగ్ గురించి ఏమంటారు అని ప్రశ్నించగా.. తన రూపాన్ని గర్వంగా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ‘ నా ముక్కు నా నాన్న పోలిక.. నా తండ్రికి గుర్తింపుగా ఉన్న ఈ ముక్కును ఎలా తొలగించుకుంటా? అర్థం పర్థం లేని పనులు ఎలా చేస్తా?’ అని చెప్పింది. ఈ ఆన్సర్ చాలా మంది నెటిజన్ల మనసు దోచగా.. ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. బాస్ మూవ్ అంటూ కొనియాడుతున్నారు. దీన్నే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






