తెలుగు యూట్యూబర్ తినే ఆహారంలో డ్ర‌గ్స్, "గే" గా మార్చేందుకు కుట్ర‌లు !

by velandi.Saikiran |   (  Updated:2026-02-09 05:00:38  IST  )

యూట్యూబ్ నడిపిస్తున్న నంద కిషోర్ పైన హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది.

తెలుగు యూట్యూబర్ తినే ఆహారంలో డ్ర‌గ్స్, గే గా మార్చేందుకు కుట్ర‌లు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది యూట్యూబర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొందరు ట్రావెల్ యూట్యూబర్లు ఉంటే, మరి కొందరు వంటలు చేస్తూ పాపులర్ అవుతున్నారు. ఇందులో తెలుగు ట్రావెలర్లు చాలా తొంద‌ర‌గా పాపుల‌ర్ అవుతూ ఉంటారు. వీళ్లు ఇండియా అందాలే కాకుండా విదేశాలకు వెళ్లి మరీ, మంచి కంటెంట్ అందిస్తారు. అలాంటి వారిలో నంద కిషోర్ అనే తెలుగు యూట్యూబర్ ఒకరు. ఇతడిది రాజమండ్రి పరిసర ప్రాంతం. నందాస్ జర్నీ పేరుతో యూట్యూబ్ ఛానల్ ( Nanda's Journey) పెట్టిన నందా కిషోర్, మంచి కంటెంట్ అందిస్తూ ముందుకు సాగుతున్నారు.

డివోషనల్ టూర్లు చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం నంద కిషోర్ యూట్యూబ్ ఛానల్ కు 600k సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రతి కంటెంట్ ను అర్థవంతంగా వివరిస్తూ, వీడియో చివరి వరకు చూసేలా మంచి వివ‌ర‌ణ‌ నందకిషోర్ దగ్గర ఉంటుంది. అందుకే ఇతని వీడియోలు చాలామంది చూస్తూ ఉంటారు. లక్షలలో వ్యూస్ కూడా వస్తాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే నెల‌కు రూ.ల‌క్ష సంపాదిస్తున్నాడు నంద కిషోర్‌.

నంద కిషోర్ పై హత్యాయత్నం ?

యూట్యూబ్ నడిపిస్తున్న నంద కిషోర్ పైన హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్వయంగా యూట్యూబర్ నంద కిషోర్ తన యూట్యూబ్ లో వీడియోను కూడా అప్లోడ్ చేశాడు. తన మేనమామ, వాళ్ల కుటుంబ సభ్యులందరూ కలిసి తనను హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని షాకింగ్ నిజాలను బయటపెట్టాడు. దీని కోసం తనపై విష ప్రయోగం కూడా చేసినట్లు బాంబు పేల్చాడు నంద కిషోర్. తన యూట్యూబ్ ఛానల్ ను స్వాధీనం చేసుకునేందుకుగాను ఈ కుట్రలకు పన్నుతున్నారట. చిన్నప్పటి నుంచి మేనమామ ఇంట్లో పెరిగిన నంద కిషోర్... వాళ్లను గుడ్డిగా నమ్మారట. యూట్యూబ్ ద్వారా నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్న నంద కిషోర్ ను దెబ్బతీయాలని ప్లాన్ వేశారట. ఆ యూట్యూబ్ ఛానల్ ను తన కొడుకుకు ఇచ్చేందుకు నంద కిషోర్ మేనమామ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన వీడియోలో కూడా చెప్పాడు నంద కిషోర్.

దీని కోసం మొదటి నుంచి స్లో పాయిజన్ తనకు ఎక్కించారట. ఒకేసారి చంపేస్తే డౌట్ వస్తుందని, స్లో పాయిజన్ ఇస్తున్నారని నంద కిషోర్ వెల్లడించారు. అలాగే తన హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అయ్యేలా కుట్రలకు కూడా తెర లేపారట. అతన్ని గే గా మార్చి, సమాజంలో చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్రలు పడ్డారట. నంద కిషోర్ పై ఏదో ఒక రూపంలో బుర‌ద జ‌ల్లి, ఆ తర్వాత కిడ్నాప్ చేసి మరి హత్య చేసేందుకు కుట్రలు పన్నారట. దీని కోసం నంద కిషోర్ తల్లిని కూడా వాడుకున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు ఒకవేళ మరో వారం రోజులలో తన ఛానల్ నుంచి మరో వీడియో రాకపోతే, వాళ్లు తనను చంపేసినట్లేనని బాంబు పేల్చాడు నంద కిషోర్. ఒకవేళ తాను మరణిస్తే, తన ఫాలోవర్స్ పోలీసులకు కంప్లైంట్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే దీనిపై కొంత మంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. తన ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ఇదొక కుట్ర కోణం అంటూ చురకలు అంటిస్తున్నారు. వీడియో పెట్టడం కంటే బదులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్తే సరిపోతుంది కదా...? ఆ మాత్రం తెలియదా అని నందకిషోర్ కు కౌంటర్ ఇస్తున్నారు.

Next Story