నాగ పంచమి స్పెషల్.. పుట్టలో పాము ఉందో.. లేదో.. కానీ, నెట్టింట మాత్రం ఫుల్ వైరల్!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-29 07:36:21  IST  )

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. వరుస పండుగలు పలకరిస్తుంటాయి.

నాగ పంచమి స్పెషల్.. పుట్టలో పాము ఉందో.. లేదో.. కానీ, నెట్టింట మాత్రం ఫుల్ వైరల్!
X

దిశ, వెబ్ డెస్క్: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. వరుస పండుగలు పలకరిస్తుంటాయి. హిందువులు శ్రావణ శుక్లపక్ష పంచమి నాడు నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జులై 29న నాగ పంచమి (Naga Panchami) పండగ వచ్చింది. ఈరోజున సాధారణంగా మహిళలు, ముఖ్యంగా సంతానం లేని వారు పాములకు అధిపతైన నాగదేవతను పూజించడం, పుట్టలో పాలు పోయడం, నాగచరిత్ర పారాయణ చేయడం ఆచారంగా వస్తుంది. అయితే, ఇదంతా ఓల్డ్ ట్రెండ్ అనుకున్నారేమో కొంతమంది యువకులు, నాగ పంచమిని ఈసారి డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాను (Social media) షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ యువకులు నాగ పంచమిని ఎలా జరుపుకున్నారంటే?

వీడియోలో పగడ విప్పిన నాగుపాము చుట్టూ కొంతమంది యువకులు చేరి, ఒక్కసారిగా 'హ్యాపీ బర్త్‌డే నాగుబాయ్!' అంటూ జైజైలు కొట్టడం ప్రారంభించారు. అది విని నాగుపాము సైతం షాక్‌లో పడిందో ఏమో, తన చుట్టూ ఏం జరుగుతోందో అర్థం కానట్లుగా అదే చోట కదలకుండా ఉండిపోయింది. సాధారణంగా పాము కనిపించగానే ఎవరైనా భయంతో పరుగెత్తుతారు. అలాంటిది ఈ యువకులు చేసిన ఈ పని ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇక ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది యువకుల క్రియేటివిటీని మెచ్చుకుంటుంటే, మరికొందరు పామును ఇలా వినోదానికి వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ఇది వినోదంగా కనిపించినా, జంతుశ్రేయస్సు, భద్రతాపరంగా ఇది అత్యంత ప్రమాదకరమైన చర్యగా భావిస్తున్నారు.

Next Story