- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2026లో నరకం చూపిస్తా: ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్‌పై అన్వేష్ రియాక్షన్
తన ఇన్ స్టా అకౌంట్ ను మెటా యాజమాన్యం బ్యాన్ చేయడంపై నా అన్వేషణ అన్వేష్ స్పందించాడు. మరో అకౌంట్లో ఆ వీడియోను పోస్ట్ చేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ యాత్రికుడిగా ఫేమస్ అయిన అన్వేష్ కు మెటా షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల అతను చేసిన కొన్ని వీడియోలు నెట్టింట తీవ్రదుమారానికి దారితీయడంతో పలువురి ఫిర్యాదులు, వరుసగా నెటిజన్లు ఇన్ స్టా ఐడీకి రిపోర్టు చేయడంతో మెటా naa_anveshana5 ఇన్ స్టా అకౌంట్ ను బ్యాన్ చేసింది. తాజాగా దీనిపై అన్వేష్ స్పందించాడు. మరో ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేసి.. అందులో తన రియాక్షన్ వీడియో పోస్ట్ చేశాడు.
"ఇన్ స్టాగ్రామ్ ఛానల్ పోయినందుకు నాకేం బాధ లేదు. రూపాయి రాని ఇన్ స్టాగ్రామ్ ఉంటే ఏంటి పోతే ఏంటి. ఇన్ స్టా ఛానల్స్ prapranchayatrikuduu, naa_anveshana5, యూట్యూబ్ ఛానల్స్ naa anveshana, prapancha yatrikudu నాకు రెండు చేతులు, రెండు కాళ్లు లాంటివి. ఫేస్ బుక్ అకౌంట్ నా బాడీతో సమానం. ఎన్ని అకౌంట్లు బ్యాన్ చేసినా వీడియోలు చేయడం ఆపను. అన్నీ బ్యాన్ చేసినా.. వాటన్నింటినీ నడిపించే నా బుర్రని ఏం చేయలేరు. ఒక చేతిని విరగ్గొడితే ఇంకొ చెయ్యి, రెండుకాళ్లతో ముందుకు వెళ్తా. రెండో చెయ్యి పోతే రెండు కాళ్లు, కాళ్లు కూడా తీసేస్తే బాడీతో పాకుకుంటూ వెళ్తా. దానిని తీసేస్తే నా బుర్రే ఆయుధంగా పనిచేస్తది. ఎవరెన్ని చేసినా.. నేను చేయాల్సింది చేస్తా. ఇన్ స్టాలో ఎలాంటి ప్రమోషన్లు, లింకులు ఇవ్వలేదు. అయిన్ బ్యాన్ చేయించారు. 2026లో బత్తాయిలకు నరకం చూపిస్తా. యూట్యూబ్ నుంచే లాస్ట్ మంత్ రూ.8 లక్షల ఇన్కమ్ వచ్చింది." అని అన్వేష్ తాజా వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కింద పాజిటివ్ కామెంట్స్ రావడం గమనార్హం. మా సపోర్ట్ నీకే అంటూ.. నెటిజన్లు అన్వేష్ కు మద్దతిస్తున్నారు.






