- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mysterious deaths : మంచు కొండల్లో ఆగని మిస్టరీ మరణాలు
జమ్ము కశ్మీర్(Jammu Kashmir) లో జరుగుతున్న మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : జమ్ము కశ్మీర్(Jammu Kashmir) లో జరుగుతున్న మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయి.. రాజౌరీ(Rajoury) లోని బాదాల్(Badal) లో జరుగుతున్న వింత మరణాలను(Mysterious deaths) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకున్నాయి. డిసెంబర్ నెలలో ఓ కుటుంబంలో జరిగిన దినకర్మ కార్యక్రమానికి వచ్చిన వారి కుటుంబాల్లో మాత్రమే ఈ మరణాలు చోటు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నెల రోజుల్లో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది చనిపోవడంపై ఆ గ్రామంలో భయం గుప్పిట్లో గడుపుతోందీ. చనిపోతున్న వారిలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎలాంటి జబ్బు చేయకుండా మరణించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామంలో ప్రత్యేక మొబైల్ ల్యాబోరేటరీని ఏర్పాటు చేయగా.. కేంద్ర ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక బృందాలను ఆ గ్రామానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha).. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు ఈ మిస్టరీ మరణాలు ఎంత తీవ్రమైనవో. మరి 17 మంది వింత మరణాలపై కారణం ఏమిటో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. ఇదిలా ఉంటే రాజౌరీ ప్రాంత ప్రజలు మాత్రం ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియక భయంతో వనికిపోతున్నారు.






