కొద్ది రోజుల్లో చెల్లి పెళ్లి.. షాక్ ఇచ్చిన జొమాటో! రోడ్డుపై ఏడుస్తూ..

by Disha Web Desk 14 |
కొద్ది రోజుల్లో చెల్లి పెళ్లి.. షాక్ ఇచ్చిన జొమాటో! రోడ్డుపై ఏడుస్తూ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొన్ని సాంకేతిక కారణాలతో జోమాటో డెలివరీ బాయ్స్ అకౌంట్‌లను ఆ సంస్థ అప్పుడప్పుడు బ్లాక్ చేస్తుంటది. అకౌంట్ బ్లాక్ చేసినప్పుడు డెలివరీ బాయ్‌కి ఎలాంటి ఆర్డర్స్ పడవు. తర్వాత ఆ డెలివరీ బాయ్ కొత్త ఐడీ క్రియేట్ చేసుకోవాలి.. లేదా తన ఐడీ యాక్టీవ్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. దాదాపు అయితే సంస్థ ఐడీ యాక్టీవ్ చేయడం అనేది కష్టమే. అయితే ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. ఓ జొమాటో డెలివరీ బాయ్ ఏడుస్తున్న ఫోటో ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. డెలివరి బాయ్ జొమాటో ఖాతా.. సంస్థ బ్లాక్ చేసిందని పేర్కొన్నారు.

కొద్ది రోజుల్లో తన చెల్లి పెళ్లి ఉందని, అతనికి డబ్బులు సంపాదించే ఒకే ఒక ఆధారమైన జోమాటో డెలివరీ ఒక్కటేనని, అతని ఖాతా బ్లాక్ అవ్వడంతో తను ఏడుస్తూ ఢిల్లీలోని జీటీబీ నగర్ రోడ్డుపై తాజాగా కనిపించాడని పేర్కొన్నారు. అతని జొమాటో ఐడీ త్వరగా యాక్టీవ్ చేయాలని జోమాటో సంస్థకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. మరోవైపు తన చెల్లి పెళ్లికి నెటిజన్లు ఆర్థిక సాయం చేయాలని డెలివరీ బాయ్ బ్యాంక్ అకౌంట్ క్యూఆర్ కోడ్ కూడా పోస్ట్ చేశారు. దీంతో ట్విట్టర్ పోస్ట్ దాదాపు 2 మిలియన్ల వీక్షణలతో వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. అతని ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు జొమాటో సంస్థ కూడా స్పందించింది. అతని జొమాటో ఐడీని వెంటనే యాక్టీవ్ చేస్తామని హామీ ఇచ్చింది.


Next Story

Most Viewed