Muddy Roads: బైక్ ఎత్తిన బాహుబలి! బురదమయంగా రోడ్లు.. గ్రామస్తుల పాట్లు.. ఎక్కడంటే?

by Ramesh Naini |

కుండపోతగా వర్షం పడిందంటే నగరాల్లో వరద.. గ్రామాల్లో బురద సర్వ సాధారణం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సరైన రోడ్డు సదుపాయం ఉండదు.

Muddy Roads: బైక్ ఎత్తిన బాహుబలి! బురదమయంగా రోడ్లు.. గ్రామస్తుల పాట్లు.. ఎక్కడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: (viral Videos) కుండపోతగా వర్షం పడిందంటే నగరాల్లో వరద.. గ్రామాల్లో బురద సర్వ సాధారణం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సరైన రోడ్డు సదుపాయం ఉండదు. దీంతో వర్షం కురిసిందంటే ఆ మట్టి రోడ్డు కాస్త బురదమయంగా (Muddy roads) మారుతాయి. తాజాగా (Maharashtra) మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సతారా (Satara) జిల్లాలోని ఓ గ్రామంలో వారికి ఉన్న ప్రధాన రోడ్డు బురదమయం అయింది. దీంతో ప్రజలు రోడ్డుపై వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురదతో ఉన్న రోడ్లపై బైక్‌, స్కూటీ, ఆటోలు లాంటి వాహానాల్లో ప్రయాణించడం కష్టంగా ఉంది. ఈ క్రమంలోనే ఓ యువకుడు చేసిన (bike stunts) బైక్ స్టంట్‌కు నెటిజన్లు షాక్ అయ్యారు. ఓ యువకుడు తన బైక్‌ను భుజాన ఎత్తుకోని బురద రోడ్డుపై నడుచుకుంటూ పోతాడు. ఈ రోడ్డుపై వెళితే బండి స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని, బురదలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఆ యువకుడు తన బైక్‌ను భుజాలపై ఎత్తుకోని వెళ్లాడు.

రోడ్డు బాగు చేయించాలని మరోవైపు గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బాహుబలి సినిమాలో ప్రబాస్ తన భూజలపై ఎత్తుకోని వెళ్లిన శివలింగం సీన్‌ను నెటిజన్లు గుర్తుకు చేస్తున్నారు. ఆ బాహుబలి అమ్మ కోసం శివలింగం ఎత్తితే.. ఈ బాహుబలి ఊరు రోడ్డు బాగోగు కోసం బైక్ ఎత్తాడని నెటిజన్లు అతడిని ప్రశంసించారు. వెంటనే ఇలాంటి గ్రామాల్లో బురద రోడ్లను అధికారులు గమనించి బాగు చేయించాలని ప్రభుత్వాలకు నెటిజన్లు సూచిస్తున్నారు.

Next Story