- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీఎస్టీపై తగ్గింపు వ్యాఖ్యలతో ఎంపీ రవి కిషన్ పై ట్రోలింగ్
జీఎస్టీ తగ్గింపుపై గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆయన ట్రోలింగ్ కు గురవుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ స్లాబ్ లలో చరిత్రాత్మక (Changes in GST slabs) మార్పులు చేసిన విషయం తెలిసిందే. అయితే జీఎస్టీ తగ్గింపు (GST deduction)పై గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్ (MP Ravi Kishan) చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆయన ట్రోలింగ్ (trolling) కు గురవుతున్నారు. జీఎస్టీ తగ్గింపులపై ఆయన మాట్లాడుతూ “జీఎస్టీ వల్ల అన్ని వస్తువులు 50% తగ్గింపుతో లభిస్తున్నాయి” అని పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా.. ప్రతి 100 రూపాయలకు 45, వెయ్యి రూపాయలకు 450, ఐదు వేలకు 2450 మిగులుతాయని ఈ సందర్భంగా ఎంపీ రవి కిషన్ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు వెంటనే వైరల్ అవగా, నెటిజన్లు ఆయనను తీవ్రంగా ఎద్దేవా చేస్తూ వ్యంగ్యంగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు (Opposition Leaders) కూడా ఈ వీడియోను పంచుకుంటూ బీజేపీపై విమర్శలు (Criticism of BJP) గుప్పించారు. అఖిలేష్ యాదవ్ సహా పలువురు రాజకీయ నాయకులు రవి కిషన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.






