- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mounjaro Brides: పెళ్లి కూతుళ్ల ప్రాణాలతో చెలగాటం.. వెలుగులోకి ‘మౌంజారో బ్రైడ్స్’ మెడికల్ స్కామ్!
పెళ్లి రోజున సన్నగా కనిపించాలని కాబోయే వధువులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మెట్రో నగరాల్లో కలకలం రేపుతున్న ‘మౌంజారో బ్రైడ్స్’ మెడికల్ స్కామ్ వెనుక భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి నిశ్చయమైందంటే ఒకప్పుడు వధువులు జిమ్‌కు వెళ్లడం, సౌందర్య చిట్కాలు పాటించడంతో పాటు కఠినమైన ఆహార నియమాలు అనుసరించడం చూశాం. కానీ ఇప్పుడు భారతీయ మెట్రో నగరాల్లో పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ‘మౌంజారో బ్రైడ్స్’ (Mounjaro Brides) అనే ప్రమాదకరమైన నయా ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. పెళ్లి రోజున నాజూగ్గా కనిపించడం కోసం డైట్, వ్యాయామం వంటి సహజ పద్ధతులను పక్కనపెట్టి.. వధువులు ఇప్పుడు GLP-1 ఇంజెక్షన్ల వైపు మళ్లుతున్నారు. ఢిల్లీ, ముంబైలోని కొన్ని ప్రముఖ క్లినిక్‌లు ఈ ట్రెండ్‌కు ప్రధాన కేంద్రాలుగా మారాయి.
నడుము కొలతను బట్టి రేటు ఫిక్స్..
‘మౌంజారో బ్రైడ్స్’ ట్రెండ్‌లో భాగంగా కొన్ని క్లినిక్‌లు బహిరంగంగా, మరికొన్ని రహస్యంగా 'బ్రిడల్ వెయిట్ లాస్' ప్యాకేజీలను విక్రయిస్తున్నాయి. నడుము కొలతను బట్టి ధర మారుతుందని క్లినిక్ నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా వారానికి మౌంజారో ఇంజెక్షన్లకు రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకు ఖర్చవుతుండగా, పూర్తి కోర్సు అయ్యేసరికి ఆ ఖర్చు రూ. 50,000 దాటుతోంది.
అసలు ఆ మందులు ఏం చేస్తాయి?
టైప్-2 డయాబెటిస్ (Type-2 Diabetes), తీవ్రమైన ఊబకాయం ఉన్న రోగుల కోసం రూపొందించిన ‘పెప్టైడ్’ (Peptide) ఆధారిత మందులను పెళ్లి కాబోయే వధువులకు యథేచ్ఛగా ఇస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు మొదట ఆకలిని నియంత్రిస్తాయి. ఆహారం జీర్ణవ్యవస్థలో ఎక్కువ సేపు ఉండేలా చేసి, కడుపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. దీంతో వధువులు వేగంగా బరువు తగ్గుతారు. అయితే, ఈ ఇంజెక్షన్ల వల్ల వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, జీర్ణకోశ సమస్యలు తక్షణమే తలెత్తుతున్నాయి. కొందరిలో తక్కువ డోస్‌కే ప్రాణాంతక పరిస్థితి ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
ఈ ‘మౌంజారో బ్రైడ్స్’ ట్రెండ్‌పై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఏమాత్రం క్షేమం కాదని హెచ్చరిస్తున్నారు. ఒక్క రోజు పెళ్లి వేడుకలో పర్ఫెక్ట్‌గా కనిపించాలనే ఒత్తిడితో వధువులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా బరువు తగ్గడం కంటే, ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.






