కన్న బిడ్డ కడుపు నింపేందుకు తల్లి కష్టం చూడండి.. రొట్టెలు చేస్తూ

by velandi.Saikiran |

తన రెండేళ్ళ చిన్నారిని ఎత్తుకొని... చపాతీలు చేస్తూ జీవనాన్ని గడిపిస్తోంది ఓ తల్లి

కన్న బిడ్డ కడుపు నింపేందుకు తల్లి కష్టం చూడండి.. రొట్టెలు చేస్తూ
X

దిశ, వెబ్ డెస్క్: కన్నతల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కన్న బిడ్డల కోసం... వాళ్ల కడుపు నింపేందుకు... తల్లి ఎంతటికైనా తెగిస్తుంది. తన రక్తం బొట్టు చిందించి మరి... తన బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది తల్లి. అందుకే అమ్మ ప్రేమ చాలా గొప్పది అంటారు. అయితే తాజాగా ఓ సన్నివేశం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

తన రెండేళ్ళ చిన్నారిని ఎత్తుకొని... చపాతీలు చేస్తూ జీవనాన్ని గడిపిస్తోంది ఓ తల్లి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని ఓ ఏరియాలో.. జొన్న రొట్టె, చపాతీలు అమ్ముకుంటూ.. ఓ యువతి తన జీవనాన్ని కొనసాగిస్తోంది. అయితే ఇలా జీవనం కొనసాగించడం చాలా కామనే.

కానీ తన రెండేళ్ల చిన్నారిని ఎత్తుకొని... జొన్న రొట్టె అలాగే చపాతీలు చేసుకుంటూ.. వాటిని అమ్మేస్తూ కనిపించింది ఆ తల్లి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఆ తల్లి చాలా గొప్పదని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి మహిళలకు సహాయం ఎవరైనా చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వమైనా.. ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. క్లిక్

Next Story