- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఏడాదిలో మోస్ట్ ట్రెండింగ్ ట్రావెల్ డెస్టినేషన్ .. ఈ హిల్ స్టేషనే
లాంగ్ వీకెండ్, ఫెస్టివల్ హాలిడేస్ వంటివి వస్తే.. ఫ్యామిలీతో కలిసి ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లి చిల్ అవ్వాలని చాలా మంది అనుకుంటుంటారు.

దిశ, వెబ్ డెస్క్: లాంగ్ వీకెండ్, ఫెస్టివల్ హాలిడేస్ వంటివి వస్తే.. ఫ్యామిలీతో కలిసి ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లి చిల్ అవ్వాలని చాలా మంది అనుకుంటుంటారు. 2025 మొదలై అప్పుడే 8 నెలలు పూర్తి కావస్తున్నాయి. ఈ 8 నెలల్లో ఇండియన్స్ ఎక్కువగా విజిట్ చేసిన ట్రావెల్ డెస్టినేషన్స్ పై ట్రావెల్ సెర్చ్ ఇంజిన్ స్కైస్కానర్ చేసిన తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ ఏడాదిలో మోస్ట్ ట్రెండింగ్ ట్రావెల్ డెస్టినేషన్ గా మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నిలిచింది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అక్కడ విమాన శోధనలు 828 శాతం పెరిగినట్లు అధ్యయనం నివేదించింది.
షిల్లాంగ్ నే ఎందుకు అంతలా ఆదరిస్తున్నారు అంటే.. ఈ ప్రాంతాన్ని ఈస్ట్ స్కాట్లాండ్ గా పిలుస్తారు. పచ్చని కొండలు, ఎగసిపడే జలపాతాలు, స్పష్టమైన సరస్సులను చూస్తూ ఉంటే.. స్వర్గంలో ఉన్నామా అని అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదేమో. షిల్లాంగ్ ఇంతలా ఫేమస్ అవడానికి సోషల్ మీడియా కూడా ఒక కారణం. మనోళ్ల సంగతి తెలిసిందేగా.. కంటికి నచ్చే ప్రకృతి ఆహ్లాదకరమైన వీడియో ఏదైనా సరే వైరల్ చేసేస్తారు. షిల్లాంగ్ లో పొగమంచు దృశ్యాలు, కేఫ్ లు, సంగీతం, ఇతర ప్రకృతి సౌందర్యాలు మనసుల్ని కట్టిపడేస్తాయి. ఒకవేళ మీరు షిల్లాంగ్ కు వెళ్లాలనుకుంటే మాత్రం అక్కడ కొన్ని ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వకండి..
ఉమియం సరస్సు - ఇది బోటింగ్ కు, పిక్నిక్ లకు అనువైన ప్రశాంతమైన ప్రదేశం. ఈ సరస్సులో వాటర్ చాలా ప్యూర్ గా ఉంటాయి. ఎంత ప్యూర్ గా అంటే.. నీటి అడుగున సంచరించే జలచరాలు కూడా కనిపిస్తాయి.
ఎలిఫెంట్ ఫాల్స్ - షిల్లాంగ్ సమీపంలో అనేకమంది ఫొటోలు తీసిన ఫాల్స్ లో ఇది ఒకటి.
పోలీస్ బజార్ - నగరంలో సందడిగా ఉండే ప్రదేశం. ఈ ప్రాంతంలో షాపింగ్ తో పాటు స్థానికంగా ప్రసిద్ధి చెందిన వంటలు లభిస్తాయి.
మాఫ్లాంగ్ ఫారెస్ట్ - ఇది పురాతన ఖాసీ సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ఫారెస్ట్.
షిల్లాంగ్ వెళ్లాలనుకునేవారు సెప్టెంబర్ నుంచి మే మధ్య సమయంలో ప్లాన్ చేసుకుంటే బెటర్. ఈ సమయంలో అక్కడి వాతావరణం ట్రెక్కింగ్ కు, ఇతర ప్రదేశాలను చూసేందుకు అనువుగా ఉంటుంది.






