- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకప్ అయింది సర్.. లీవ్ కావాలి.. వెరీ హానెస్ట్ లీవ్ అప్లికేషన్ అన్న సీఈఓ
ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎమర్జెన్సీ లీవ్, హాఫ్ డే లీవ్, షిఫ్ట్ మధ్యలో వెళ్లాలంటే ఆ సంస్థ యజమాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎమర్జెన్సీ లీవ్, హాఫ్ డే లీవ్, షిఫ్ట్ మధ్యలో వెళ్లాలంటే ఆ సంస్థ యజమాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది. అనారోగ్యం, ఇంట్లో పనులు, పెళ్లి, వెకేషన్ కోసం సెలవులు పెడుతుంటారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం తనకు రీసెంట్ గానే బ్రేకప్ అయిందని, ఆ బాధను తట్టుకోలేకున్నానని, కోలుకునేందుకు కొద్దిరోజులు సెలవు కావాలంటూ సీఈఓకు లీవ్ అప్లికేషన్ పంపాడు. దీంతో ఆ సంస్థ సీఈఓ చాలా నిజాయితీ గల లీవ్ అప్లికేషన్ అంటూ.. ఆ మెయిల్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాట్ డేటింగ్ (Knot Dating) అనే సంస్థ సీఈఓ జస్వీర్ సింగ్ తన ఎంప్లాయి లీవ్ రిక్వెస్ట్ మెయిల్ ను నెటిజన్లతో పంచుకున్నారు.
అందులో తనకు బ్రేకప్ అయిందని, వర్క్ పై శ్రద్ధ పెట్టలేకపోతున్నానని తెలిపాడు. బ్రేకప్ నుంచి కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని, కొద్దిరోజులు జాబ్ నుంచి బ్రేక్ కావాలని కోరారు. అందుకోసం తనకు లీవ్ మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేశాడు. తన ప్రొఫెషనల్ లైఫ్ లో తాను చూసిన నిజాయితీ గల లీవ్ అప్లికేషన్ అన్నారు. జెన్ జెడ్ (GenZ) తన మనసులో ఏమీ దాచుకోదని, ఈ జనరేషన్ ఉద్యోగులు తమ మానసిక సమస్యలు, భావోద్వేగాలను ఓపెన్ గా చెప్తున్నారన్నారు. కాగా.. ఈ బ్రేకప్ లీవ్ లెటర్ నెట్టింట వైరల్ అవ్వగా.. ఆ ఉద్యోగి హానెస్టీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఒకరైతే ఇంతకీ ఆ ఎంప్లాయ్ కి లీవిచ్చారా ? అని సంస్థ సీఈఓను ప్రశ్నించారు. ఆ మెయిల్ చదివిన వెంటనే ఇచ్చేశాను అని ఆయన బదులిచ్చారు.






