- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mosquito drones : వావ్.. దోమ సైజు డ్రోన్లను చూశారా..? వీటి ఉపయోగాలు ఏమిటంటే..
Mosquito drones : వావ్.. దోమ సైజు డ్రోన్లను చూశారా..? వీటి ఉపయోగాలు ఏమిటంటే..

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చిన మార్పుల్లో డ్రోన్లు కూడా ఒకటి. వీడియో షూటింగ్ మొదలు కొని, మనుషులు చేరలేని పర్వత ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేయడం వరకు వీటిని ఉపయోగిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో, యుద్ధ సమయాల్లోనూ వినియోగిస్తారు. సాధారణంగా ఇవి కాటన్ బాక్స్ సైజు మొదలు కొని వాటి సామర్థ్యాన్ని బట్టి ఎంత పెద్దవి అయినా ఉండవచ్చు. కానీ దోమ సైజు డ్రోన్లు కూడా ఉంటాయని మీరెప్పుడైనా ఊహించారా? ప్రస్తుతం చైనా వీటిని తయారు చేస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చైనాలోని హునాన్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకి చెందిన నిపుణులు ఇటీవల ‘దోమ-సైజు(Mosquito-sized)’ సైనిక డ్రోన్‌లను ఆవిష్కరించారు. అయితే ఈ బయోనిక్ మైక్రో-డ్రోన్‌లు చెట్ల ఆకు నమూనాలతో కూడిన రెక్కలు, జుట్టులాంటి సన్నని కాళ్లతో రూపొందించబడ్డాయి. మరో ప్రత్యేకత ఏంటంటే వీటిని యాక్టివేట్ చేసి వదిలేస్తే అందులోని సాంకేతిక సూచికల ఆధారంగా ఆటోమేటిగ్‌గా పనిచేస్తాయి. ఎటువంటి శబ్దం కూడా రాదు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా చొచ్చుకొని పోయి రహస్యాలను ఛేదించడంలో, సమాచారాన్ని అందించడంలో ఇవి సహాయపడగలవని, ముఖ్యంగా గూఢ చర్యం, నిఘా విషయంలో పోలీసులకు, ఆర్మీకి బాగా ఉపయోపడతాయని వాటిని తయారు చేసిన సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు.






