- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్విస్ బ్యాంక్‌కు మించిన భద్రత? పర్వతాలపై దాగిన పల్లె బ్యాంకులు.. 500 ఏళ్ల క్రితమే!
ఇప్పుడంటే డబ్బు, నగలు, బంగారం వంటి విలువైన వస్తువులు భద్రంగా దాచుకునేందుకు బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇప్పుడంటే డబ్బు, నగలు, బంగారం వంటి విలువైన వస్తువులు భద్రంగా దాచుకునేందుకు బ్యాంకులు (Banks) అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఊర్లో ఏదో ఒక బ్యాంక్ ఉంటుంది. లాకర్లు, ఏటీఎంలు, ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యాలూ ఇవాళ సర్వసాధారణం. కానీ మొరాకోలో (Morocco) 500 ఏళ్ల క్రితమే, నేటి బ్యాంకింగ్ సెక్యూరిటీకి తలదన్నే అద్భుతమైన విధానం ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. దానికి పేరు ఇగౌదార్ (Igoudar). ఇవి పర్వతాలపై నిర్మించిన గోడధాన్యాలు (fortified granaries), గ్రామీణ బ్యాంకుల్లా ఉపయోగించబడేవి. మరీ వాటి విశేషాలేంటో తెలుసుకుందామా.
దక్షిణ మొరాకోలోని అమాజిగ్ తెగల ప్రజలు, తమ సమాజ సంపదను ఎడారి దొంగల దాడులనుంచి రక్షించేందుకు ఈ భద్రమైన గదులను ఎత్తైన ప్రాంతాల్లో నిర్మించారు. ఇవి ముఖ్యంగా సూస్-మస్సా ప్రాంతం, ఆంటీ-అట్లాస్ పర్వతాల్లో కనిపిస్తాయి. ఇగౌదార్‌లలో ధాన్యం, గింజలు, ఖర్జూరాలు, నూనెతో పాటు, చిరకాలిక విలువ కలిగిన వెండి ఆభరణాలు, నేసిన తివాచీలు, చట్టపత్రాలు వంటి నిధులూ భద్రపరచేవారు. ప్రతి కుటుంబానికి తమ గుర్తుతో తాళం వేసే ప్రత్యేక గది ఉండేది. వీటిని ఒక విశ్వసనీయ రక్షకుడు పర్యవేక్షించేవాడు. ఈ వ్యవస్థ ఎంత పురాతనమైనదైనా, అది అప్పటినుంచే ఒక సామూహిక నమ్మకం, భద్రతపై శ్రద్ధ, సమాజ శాసనాన్ని ప్రతిబింబిస్తోంది. ఇప్పటికీ కొన్ని ఇగౌదార్‌లు స్థానికుల వాడుకలో ఉన్నాయంటే, అప్పుడు ఉన్న తెలివితేటల దృక్కోణం ఎంత ఉన్నతంగా ఉందో తెలుస్తుంది.






